ఒక బాబా విర‌మించాడు.. మ‌రొక స్వామి అస్త‌మించాడు..


దేశంలోని అవినీతిని అంత‌మొందించ‌డానికి బాబా రాందేవ్ నిరాహార దీక్ష‌కు పూనుకున్నారు. ఆయ‌న నిరాహార దీక్ష‌కి దేశ‌వ్యాప్తంగా మీడియా ఎంతో ప‌బ్లిసిటీ ఇచ్చింది.. అలాగే స్వామి నిగ‌మానంద్ అత్యంత ప‌విత్ర‌మైన గంగాన‌దిలోనుండి ఇసుక‌ని త‌వ్వి తీస్తూ క‌లుషితం చేస్తుండ‌డాన్ని భ‌రించ‌లేక వాటిని వెంట‌నే ఆపివేయాల‌ని నిరాహార‌దీక్ష‌కి పూనుకున్నారు.. ఒక‌టి రెండు రోజులు కాదు.. ఏకంగా 114 రోజులు ఆయ‌న ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం కోసం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగించి చివ‌రికి మ‌ర‌ణించారు.  ఒక మ‌హ‌త్త‌ర‌మైన కార్యాన్ని సాధించ‌డానికి ఏకంగా 114 రోజుల పాటు ఆయ‌న ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టినా మీడియాలో మాత్రం ఆయ‌న చేప‌ట్టిన దీక్ష‌కి ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు.. కోట్ల‌రూపాయ‌ల న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీయ‌డం కోసం తాను దీక్ష చేప‌ట్ట‌బోతున్నాన‌ని బాబా రాందేవ్ ప్రక‌ట‌న చేయ‌డం ఆల‌స్యం వారం ప‌ది రోజుల ముందు నుండే మీడియా దాన్ని ప్ర‌ధాన వార్త‌గా చూపెట్టింది.. మ‌రి స్వామి నిగమానంద్‌పై మీడియా ఎందుకు ఫోక‌స్ చేయ‌లేదు..?  భార‌తీయులు అత్యంత ప‌విత్రంగా భావించే గంగాన‌దిని కాపాడాల‌న్న‌ది ప్ర‌ధాన విష‌యం కాదా..?  మీడియా దీనిపై ఎందుకు దృష్టి పెట్ట‌లేదు..? ప‌బ్లిసిటీ కోసం ప్రాకులాడుతూ త‌మ స్వార్థ‌ప్ర‌యోజ‌నాల‌కోసం ముసుగు వేసుకున్న వారిపై మీడియాకు ఎందుకంత మ‌మ‌కారం..? నిస్వార్థంగా ప‌విత్ర‌మైన కార్యాల‌ని భుజంపై వేసుకుని ఉద్య‌మించే స్వామి నిగమానంద్ లాంటి వారికి మీడియా ఎందుకు స‌పోర్ట్ చేయ‌డం లేదు.. గంగాన‌ది గురించి ఆయ‌న చేప‌ట్టిన దీక్ష మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తే ఆయ‌న చ‌నిపోయి వుండేవాడా..? అత్యంత విశిష్ట‌మైన‌ గంగాన‌ది క‌లుషితం అన్న‌ది ప్ర‌ధాన వార్త కాదా..? మ‌రొక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బాబారామ్‌దేవ్ దీక్ష విర‌మించిన డెహ్రాడూన్‌లోని హిమాల‌య‌న్ ఆస్ప‌త్రిలోనే స్వామి నిగ‌మానంద్ చ‌నిపోవ‌డం ఎంత దృర‌దృష్ట‌క‌రం.. బాబా రాందేవ్ దీక్ష‌కు బెంబేలెత్తిపోయిన ఉత్త‌రాంచ‌ల్ ప్ర‌భుత్వం ఎంతో మంది ప్ర‌ముఖుల‌ని పిలిపించి ఆయ‌న‌చేత దీక్ష విర‌మింప‌చేసింది.. మ‌రి.. స్వామి నిగ‌మానంద్ విష‌యంలో ఇలాంటి చొర‌వ ఎందుకు తీసుకోలేదు..?  స్వామి నిగ‌మానంద్ మ‌ర‌ణానికి కార‌ణం ఎవ‌రు..? ఆయ‌న దీక్ష‌ని విర‌మింప‌చేసి స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయ‌ని ప్ర‌భుత్వానిదా..? ఆయ‌న చేస్తున్న నిస్వార్థ దీక్ష‌కి స‌పోర్ట్ ఇవ్వ‌లేని మీడియాదా..? త‌ప్పెవ‌రిది..? ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ న‌ల్ల‌ధ‌నం కోసం చేప‌ట్టిన దీక్ష‌ని బాబా రాం దేవ్ విర‌మిస్తే.. గంగాన‌ది ప‌విత్ర‌తని కాపాడ‌టం కోసం చేప‌ట్టిన ఆమ‌ర‌ణ దీక్ష‌లో స్వామి నిగ‌మానంద్ అస్త మించారు.. కానీ.. స‌మ‌స్య‌లు మాత్రం అలాగే ఉండిపోయాయ్‌..!
సిహెచ్‌. సంతోష్‌కృష్ణ‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!