కలిసుందాం రా.. అన్నా మంత్రులు మాట్లాడరా!
మన మధ్య విబేధాలు లేవని నిరూపిద్దామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార రెడ్డి చేసిన ప్రతిపాదనకు మంత్రులెవరూ స్పందించలేదట. అంతా మౌనంగా ఉన్నారని చెబుతున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు.పదిహేను సంవత్సరాలుగా మనమంతా మంచి మిత్రులమని ఆయన గుర్తు చేశారు. మంత్రివర్గంలో అబిప్రాయబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని, దానిని పోగొట్టవలసిన అవసం ఉందని ఆయన అన్నారు. ఏమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. పార్టీ అదిష్టానం ప్రతినిధిగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీగులాం నబీ అజాద్ అందరి అభిప్రాయాలు తీసుకున్న నేపధ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఉంది. ముఖ్యమంత్రి తన క్యాబినెట్ ను సమష్టిగా నడపాలన్న ఆలోచన చేస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆయన వివాదాలు మర్చిపోయి, అంతా కలిసిపోయి పనిచేద్దామని మంత్రులందరిని కోరారు. అయితే దీనికి ఆయన ముందుగానే ఒక కసరత్తు చేసి ఉండాల్సింది. కొంతమంది మంత్రులతో దీనిపై చర్చించి, వారెవరితోనైనా ప్రతిపాదన పెట్టించి మాట్లాడి ఉండాల్సింది.నేరుగా ఆయ...