పోస్ట్‌లు

bansuwada elections pocharam srinivas reddy srinivas goud trs tdp congress party political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆధిక్యంలో పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి

చిత్రం
బాన్సువాడ ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ ఈ రోజు మొద‌ల‌య్యింది. ఓట్ల లెక్కింపులో సెకండ్ రౌండ్‌కి వ‌చ్చే స‌రికి పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి 8,235 ఓట్ల ఆధిక్యంతో కొన‌సాగుతున్నారు. బాన్సువాడ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు అంద‌రూ ఊహించిన‌వే. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమ‌యింది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పోచారం టి.ఆర్‌.ఎస్‌. అభ్యర్థిగా బ‌రిలోకి దిగ‌గా కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ‌నివాస్‌గౌడ్ నిల‌బడ్డారు. టిడిపి త‌మ అభ్యర్థిని రంగంలోకి దించ‌లేదు. దీంతో పోచారం గెలుపు ఖాయ‌మేన‌ని తెలుస్తోంది. అయితే ఆయ‌న ఎంత మెజారిటీతో గెలుపొందుతాడ్నదానిపైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.

భారీ బందోబ‌స్తు మ‌ధ్య బాన్సువాడ పోరు

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక గురువారం జరగనుంది. ఉదయం 7 నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.లక్షా 60 వేల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతకలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరా ను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడైనా బాన్సువాడ పోలింగ్‌ను వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4వేల మంది పోలీసులను భద్రత కోసం నియామించారు. 1200 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. బాన్సువాడ ఉప ఎన్నికలో మహిళ ఓట్లు కీలకం కానున్నాయి. నియోజకవర్గంలో 84310 మహిళా ఓట్లున్నాయి. 17వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ముగ్గురు ఇండిపెండెట్లు ఎన్నికల బరిలో ఉన్నారు. భారీ మెజార్టీపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది. కాంగ్రెస్ కూడా గణనీయమైన ఓట్లు వస్తాయని విశ్వసిస్తోంది.