భారీ బందోబస్తు మధ్య బాన్సువాడ పోరు
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక గురువారం జరగనుంది. ఉదయం 7 నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.లక్షా 60 వేల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతకలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరా ను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడైనా బాన్సువాడ పోలింగ్‌ను వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
4వేల మంది పోలీసులను భద్రత కోసం నియామించారు. 1200 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. బాన్సువాడ ఉప ఎన్నికలో మహిళ ఓట్లు కీలకం కానున్నాయి. నియోజకవర్గంలో 84310 మహిళా ఓట్లున్నాయి. 17వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ముగ్గురు ఇండిపెండెట్లు ఎన్నికల బరిలో ఉన్నారు. భారీ మెజార్టీపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది. కాంగ్రెస్ కూడా గణనీయమైన ఓట్లు వస్తాయని విశ్వసిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి