షారుఖ్ తెలుగు చిత్రం చేయ‌బోతున్నాడా..?


బాలీవుడ్ బాద్‌షాగా పేరు సంపాదించిన షారుఖ్ ఖాన్ తాజా చిత్రం రా..వ‌న్‌. ఈ చిత్రం కోసం షారుఖ్ రెండు సంవ‌త్సరాల పాటు క‌ష్టప‌డ్డాడు. ఈ రెండు సంవ‌త్సరాల కాలంలో స‌ల్మాన్‌ఖాన్ వ‌రుస హిట్లతో దూసుకువ‌చ్చి బాలీవుడ్ లో నెంబ‌ర్ స్థానంలో నిల‌బ‌డ్డాడు. దాంతో షారుఖ్ ఖాన్ డైలమాలో ప‌డ్డాడు. అయితే స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన చిత్రాలు వాంటెడ్‌, రెడీ లు తెలుగు చిత్రాల రీమేకులు కావ‌డం.. ఆ చిత్రాల‌లో న‌టించిన స‌ల్మాన్‌ఖాన్‌కి విజ‌యాలు ద‌క్కడ‌మే కాకుండా నెంబ‌ర్‌వ‌న్ పొజిష‌న్‌కి చేరుకోవ‌డంతో ఇప్పుడు షారుఖ్ ఖాన్ దృష్టి టాలీవుడ్ పై ప‌డింద‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్యే త‌న రా..వ‌న్ చిత్రం ప్రమోష‌న్‌కి వ‌చ్చిన షారుఖ్ తాను ద‌క్షిణాది భాష‌ల్లో స్ట్రెయిట్ చిత్రం చేస్తాన‌ని, అది త‌న డ్రీమ్ అని అన్నారు. దీంతో షారుఖ్ త్వర‌లోనే ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలోనో లేక త‌మిళ చిత్రంలోనో న‌టించ‌బోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా ద‌ర్శకులు పూరీ జ‌గ‌న్నాథ్‌, రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి వారు హిందీ చిత్రాలు చేసి కూడా త‌మ స‌త్తా చాటుకుంటున్న నేప‌థ్యంలో షారుఖ్‌ఖాన్ వీరి ద‌ర్శక‌త్వంలో చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అటు త‌మిళ ద‌ర్శకులు మురుగ‌దాస్‌, శంక‌ర్ ల‌తో కూడా షారుఖ్ మంత‌నాలు చేస్తున్నాడ‌ట‌. అన్నీ కుదిరితో త్వర‌లోనే ఓ మ‌ల్టీ లాంగ్వెజ్ చిత్రం షారుఖ్ చేస్తాడ‌న్నమాట‌.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!