ఎన్టీఆర్ మీసాలు మెలేసాడు


ఊస‌ర‌వెల్లి చిత్రంలో స్మార్ట్ బాయ్‌గా లుక్ ఇచ్చిన జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ఇప్పుడు మీసాలు మెలేసాడు. అయితే ఎన్టీఆర్ మీసాలు మెలేయ‌డం వెనుక ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీ‌ను వున్నాడు. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ద‌మ్ము. బాల‌య్య తో సింహా తీసి సూప‌ర్‌హిట్ కొట్టిన బోయ‌పాటి శ్రీ‌ను ఇప్పుడు ఎన్టీఆర్‌తో కూడా అదే స్థాయి విజ‌యం సాధించాల‌ని క‌సిగా ఉన్నాడు. సింహాలో ఫ్లాష్‌బ్యాక్‌లో క‌నిపించే బాల‌య్య గెట‌ప్‌ని వెర‌యిటీగా చూపించిన శ్రీ‌ను ద‌మ్ములో మీసాలు మెలేసిన ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించ‌బోతున్నాడ‌న్నమాట‌. యాక్షన్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డంలో త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ని చాటుకున్న శ్రీ‌ను మ‌రి ఎన్టీఆర్‌తో ఎలాంటి ఒల్లు గ‌గుర్పొడిచే యాక్షన్ స‌న్నివేశాలు చేయిస్తాడో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!