దూకుడు, ఊసరవెల్లి కలెక్షన్స్ ఓ ఫార్స్
మహేష్‌బాబు నటించిన దూకుడు, ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రాల కలెక్షన్ల లెక్కలన్నీ తప్పులేనని, ఒకరికి మించి ఒకరు పోటీగా తమ తమ సినిమా కలెక్షన్స్ కోట్లలో వసూలయ్యాయని ప్రకటించుకున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. దూకుడు ఒక రోజు రికార్డు కలెక్షన్స్ 12 కోట్లని ప్రకటిస్తే, ఊసరవెల్లి చిత్రం ఒక రోజు కలెక్షన్స్ 17 కోట్లుగా ఆయా నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ కలెక్షన్ల వివరాలన్నీ తప్పుడు లెక్కలే అని అందరూ అంటున్నారు. తాజాగా ఫిలించాంబర్ కూడా ఈ లెక్కలన్నీ తప్పులే అని తేల్చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,200 థియేటర్లు ఉన్నాయని ఈ థియేటర్లలో రోజుకు 4 ఆటలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా ప్రదర్శితమైతే వచ్చే కలెక్షన్ 8 కోట్ల రూపాయలని తేల్చి చెప్పింది. మరి దూకుడు 12 కోట్లు, ఊసరవెల్లి 17 కోట్లు ఎలా వసూలు చేసాయని ఆయా నిర్మాతలని ప్రశ్నించింది ఫిలిం ఛాంబర్. రికార్డుల వేటలో పడి ఇలా తప్పుడు లెక్కలు చూపించడంతో సినిమా ఇండస్ట్రీకే నష్టం వాటిల్లుతుందని, ఇకనైనా ఇలా తప్పుడు లెక్కలు చూపించడానికి నిర్మాతలు అత్యుత్సాహం ప్రదర్శించరాదని ఫిలించాంబర్ కోరింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి