టి-కాంగ్రెస్ ఎం.పీలు డ‌బుల్ గేమ్ ఆడుతున్నారా..?


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పి ల తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది.ముందుగా రాజీనామాలు ఆమోదించుకున్న తర్వాత మాత్రమే రైల్ రకో ఆందోళనలో పాల్గొనాలని, లేకుంటే ఏ ముఖం పెట్టుకుని ఉద్యమంలో పాల్గొంటారని బిజెపి తెలంగాణ ఉద్యమ కమిటీ ఛైర్మన్ రాజేశ్వరరావు విమర్శించారు.కేంద్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకునే విధంగా వ్యవహరిస్తూ, ఇక్కడ ఆందోళన చేస్తామంటే ఎవరు నమ్ముతారని ఆయన అన్నారు.ముందుగా రాజీనామాలు ఆమోదించుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.రైల్ రకో ఆందోళనకు వచ్చే కాంగ్రెస్ ఎమ్.పిలను తెలంగాణవాదులంతా నిలదీయాలని , వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!