పోలీసులు స‌హ‌నం కోల్పోతున్నారా..?


రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంపై సీరియస్ గా ఉంటామని హెచ్చరిస్తోంది.లా అండ్ ఆర్డర్ ఐజి అనురాధ మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు ఓపికగా ఉన్నామని,ప్రజలు తమను ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారని ఆమెఅన్నారు.విద్యాసంస్థలు స్వచ్చందంగా సమ్మె చేస్తున్నాయని చెబుతున్న ఉద్యమ కారులు ఆ సంస్థలపై ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యమ నేతలపై ఇంతవరకు ఉదయం ఆందోళన సమయంలో అరెస్టు చేసి సాయంత్రం వదలిపెడుతూ వచ్చామని , ఇకపై అలా ఉండదని, అరెస్టు చేసి రిమాండుకు పంపుతామని ఆమె హెచ్చరించారు. అంటే దీని అర్ధం ఇకపై తెలంగాణ ఉద్యమంలో అరెస్టు అయినవారిని వదలిపెట్టకుండా జైలు కు పంపుతామని హెచ్చరిస్తున్నారన్నమాట. బెయిల్ కావాలంటే కోర్టుకు వెళ్లవలసి వస్తుందని అర్ధం ఈ హెచ్చరిక ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. అయితే ప్రభుత్వ వైఖరిని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే తారకరామరావు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు.ఫ్యాక్షన్ నాయకుడి మాదిరి ముఖ్యమంత్రి కిరణ్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.గతంలో ధర్నా చేసిన రోశయ్యను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!