అంతరిక్ష విజ్ఞానంలో భారత్ ముందంజ..
వాతావరణ పరిశోధనకు తోడ్పడే మేఘా-ట్రోపిక్స్ ఉపగ్రహంతోపాటు మరో మూడు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ సీ 18) ద్వారా షార్ బుధవారం ఉదయం 11 గంటలకు అంతరిక్షంలోకి పంపింది. వెయ్యి కిలోలు బరువు ఉన్న ఈ ఉపగ్రహం లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. మూడు దశలను విజయవంతంగా దాటుకుని 24 నిమిషాల్లో పీఎస్ ఎల్ వీ నిర్ణీతకక్షలోకి ప్రవేశించనుంది.
పీఎస్‌ఎల్వీ సీ 18 రాకెట్ ద్వారా వెయ్యి కిలోల బరువు కలిగిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం మేఘా-ట్రోపిక్స్‌ను భూమికి 867 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి (సన్ సింక్రోనస్ ఆర్బిట్) వెళ్లనుంది. ఈ ఉపగ్రహాన్ని భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించాయి.
మేఘా-ట్రోపిక్స్‌తోపాటు లక్సంబర్గ్‌కు చెందిన 30 కిలోల బరువైన వెజల్‌శాట్-1, కాన్పూర్ ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు రూపొందించిన జుగ్నుశాట్(3 కిలోల బరువు), చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన ఎస్‌ఆర్‌ఎం శాట్(10 కిలోల బరువు)ను కూడా పీఎస్‌ఎల్వీ అంతరిక్షంలోకి మోసుకుపోనుంది. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి