పీఎస్ఎల్వీ-సీ 18 ప్రయోగం విజయవంతం


పీఎస్ఎల్వీ – సీ 18 ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. మేఘా ట్రాపిక్స్, మూడు నానో ఉపగ్రహాలను క్షక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో షార్‌లో ఆనందోత్సాహలు వెలువడుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసింది. నాలుగు ఉపగ్రహాలను మోసుకెళ్తున్న పీఎస్ఎల్వీ-సీ 18 రాకెట్ బరువు వెయ్యి కిలోలు. వాతావరణంలో మార్పులు, రుతుపవనాల అధ్యయనానికి మేఘా ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ప్రపంచ రికార్డును షార్ బద్దలు కొట్టింది. ఈ ఏడిదిలో మూడు ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ పీఎస్ఎల్వీ – సీ 18 ప్రయోగం విజయవంతమయ్యిందని, ఇది అందరి సమిష్టి కృషియని కొనియాడారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ – సీ 18 నాలుగు ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిందని అన్నారు. వీటిలో ప్రధానమైన మేఘ ట్రాపిక్స్ ఉపగ్రహం ఐదేళ్ల పాటు ఉష్ణమండలంలో వాతావరణ సంబంధ విషయాలపై ప్రయోగాలు చేస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా పని చేసే రిమోట్ సెన్సింగ్ ఉప గ్రహాలకు భిన్నంగా దీని పని తీరు ఉంటుందన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!