చదువులని ఆపకూడదు – బాబు
తెలంగాణ లో పిల్లల చదువులకు అడ్డుపడడం సరికాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు విద్యార్ధులతో మాట్లాడారు. అయితే కొందరు విద్యార్ధులు వేసిన ప్రశ్నలు ఆయనను చికాకుకు గురి చేసి నట్లు కధనాలు వస్తున్నాయి. ఇరవైరోజులకు పైగా విద్యార్ధులకు చదువులు లేకుండా పోతే ప్రతిపక్ష నేతగా మీరేం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు.అయితే దానికి నేరుగా సమాధానం చెప్పకుండా మీరే తన స్థానంలో ఉంటే ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాగా పిల్లల చదువుల విషయంలో మాత్రం అడ్డుపడకూడదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై నేరుగా సమాధానం చెప్పలేదు కాని, చదువుల విషయంలో చంద్రబాబు మాట్లాడినందుకు సంతోషించవలసింది. సకల జనుల సమ్మె పై మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు పడ్డం చారిత్రక విషాదం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి