ఎస్.ఎం.ఎస్.లతో ఫండ్స్ వస్తాయా..?
రాష్ట్రంలో లోక్ సత్తా పార్టీని నిర్వహించడానికి గాను విరాళాలు ఇవ్వవలసిందిగా ఆ పార్టీ అధినేత డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ కోరుతు న్నారు.ఇందులో విశేషం ఏమున్నది అనుకోవచ్చు. ఇక్కడే ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. జయప్రకాష్ నారాయణ ప్రజలకు , తన మద్దతుదారులకు ఒక ఎస్.ఎమ్.ఎస్. పంపుతూ నెలకు వంద నుంచి రెండువేల రూపాయల వరకు పార్టీకి విరాళం ఇవ్వవలసిందిగా ఆయన కోరుతున్నారు.ఇలా మెస్సేజిల ద్వారా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నే ఏకైక పార్టీ లోక్ సత్తా అని అంటున్నారు. ఇందుకోసం ఆయన నెంబర్ కూడా ఇస్తూ, ఈ మెయిల్ ఐడి పంపితే వివరాలు తెలియచేస్తామని కూడా ఆయన చెబుతున్నారు. స్వచ్చందంగా విరాళాలు కోరుతూ బహిరంగంగా చేస్తున్న ఈ జయప్రకాష్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మన దేశంలో ఇలా నెల,నెలా రాజకీయ పార్టీలు ప్రజలకు విరాళాలు ఇచ్చే విధానం ఇంకా రాలేదు. అందుకు ఎంతో కమిట్ మెంట్ అవసరం. రాజకీయ పార్టీలు నడవడానికి విరాళాలు వసూలు చేయడం తప్పు లేదని టిఆర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు గతంలో వ్యాఖ్యానించారు. అయితే అనేక రాజకీయ పార్టీలు నల్లధనాన్ని వసూలు చేస్తున్న విధంగా కాకుండా జయప్రకాష్ జనం నుంచే నెలసరి విరాళాలు కోరడం బాగానే ఉంది కాని ఎంతమంది స్పందిస్తారన్నది ప్రశ్న.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి