రాం చ‌ర‌ణ్ తేజ‌కి గాయాలు


ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ  సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. రచ్చ సినిమా షూటింగులో జరిగిన ఈ ప్రమాదం కలకలం సృష్టించింది. రాం చరణ్ తేజకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే తేజకు ప్రమాదం లేదని, స్వల్ప గాయాలేనని సిన‌మా యూనిట్ స‌భ్యులు తెలిపారు. యాక్షన్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నప్పుడు హీరోలు గాయాల బారిన ప‌డ‌డం కొత్త విష‌య‌మేమీ కాక‌పోయిన‌ప్పటికీ ఇలా గాయాల బారిన ప‌డ‌కుండా మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత హీరోల‌పై, ఫైట్ మాస్టర్లపై, ద‌ర్శకుల‌పై ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!