తెగింపు ధోర‌ణిలో సిఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ యాత్ర తర్వాత కాస్త ఏది అయితే అదవుతుందన్న ధోరణికి వచ్చారని అంటున్నారు. అంతకుముందు కూడా అలాంటి భావన ఉన్నప్పట్టికీ ఇటీవల ఇది మరీ పెరిగిందని చెబుతున్నారు.తెలంగాణ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుండడం, సకల జనుల సమ్మె పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసి, సింగరేణి కార్మికులు సమ్మెలోకి దిగడం, విద్యా సంస్థలు పనిచేయకపోవడం వంటి కారణాలు బాగా చికాకు పెడుతున్నాయి. డిల్లీ కాంగ్రెస్ అధిష్టానం కూడా సమ్మె విరమణ బాధ్యత ముఖ్యమంత్రిదేనని అనడం కూడా ఆయనకు కాస్త అసంతృప్తి కలిగించింది. అయితే ఈ నేపధ్యంలో సమ్మెకు సంబంధించి,కొన్ని రంగాలలోనైనా గట్టిగా వ్యవహరించాలని, ఏదైతే అది అవుతుందని ఆయన భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంతకాలం ఉంటాం.లేకుంటే లేదు. అంతేకాని చేసినంతకాలం గట్టిగా చేద్దాం అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఒకపక్క తెలంగాణ మంత్రులు బాధ్యతలు నిర్వహించడంలేదు. తెలంగాణ ఎమ్.పిలు కొందరు తరచూ ఢిల్లీలో తనపై ఫిర్యాదులు చేస్తుండడమే కాక, బహిరంగంగా ఘోరంగా విమర్శించడం వంటివాటిని ముఖ్యమంత్రి మౌనంగా భరిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అభిప్రాయానికి వచ్చారని, అందువల్ల ప్రజలకు ఏది మేలు అనుకుంటే అది చేయడానికి ధైర్యంగా ముందుకు వెళతారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!