పోస్ట్‌లు

cinema tickets black tickets movie halls multiplex theatres movie news movie reviews movie articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సినిమా టిక్కెట్ బ్లాక్‌లో కొనాల్సిన ప‌నిలేదు..

చిత్రం
నిజ‌మండీ.. ఆశ్చర్యపోతున్నారా..?  నిజ్జంగా నిజం.. ఇక‌నుండి సినిమా టిక్కెట్లని బ్లాక్‌లో కొనాల్సిన ప‌ని లేదు.. నేరుగా థియేట‌ర్‌లోనే బ్లా….క్‌…లో కొనుక్కోవాలి.. అవును.. ఎందుకంటారా..?  సినిమా టిక్కెట్ల రేట్‌ల‌ని పెంచేసారుగా..? ఇక బ్లాక్‌లో టిక్కెట్లు కొనాల్సిన అవ‌స‌రం లేకుండానే నేరుగా ధియేట‌ర్లలోనే బ్లాక్‌ని వైట్‌లో కొనుక్కోవ‌చ్చు.. మ‌ల్టీఫ్లెక్స్‌ల పుణ్యమా అని ఒక్కో టిక్కెట్ రేటు 100, 150 రేంజ్‌లో పెరిగిపోతే.. ఇప్పుడు మామూలు సినిమాహాల్‌ల‌లో సినిమా చూడాల‌నుకున్నా.. వాటి రేట్‌ల‌ని కూడా ప్రభుత్వం అఫీషి య‌ల్‌గా పెంచేసింది..25 రూపాయల టికెట్‌ను 30కి పెంచింది. అటు కార్పోరేషన్‌ పరిధిలోని ఏసీ థియేట ర్లలో 50 రూపాయలు ఉన్న టికెట్‌ 60కి పెంచుతున్నట్లు తెలిపింది. మిగతా ప్రాంతాల్లో 30 రూపాయల టికెట్‌ 40కి పెంచింది..  మొన్న పెట్రోలు, నిన్న గ్యాస్‌, నేడు సినిమా టిక్కెట్‌.. మ‌రిరేపు.. ? ఏంటీ ఏ రేట్లు పెంచుతారో అన్నది త‌ట్టట్లేదా.. ఎందుకండీ.. మెద‌డుని అంత వేడెక్కేలా ఆలోచిస్తారు.. ఒక్క రోజు ఆగండి.. మ‌న ప్రభుత్వాలే.. చెబుతాయి.. ఇంకా ఏమేమి రేట్లు పెంచుతాయో…?