పోస్ట్‌లు

YS. Jaganmohanreddy kadapa pulivendula ap political news kirankumar reddy congress party ysr congress party cpi cpm party లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జగన్ వైపు వామపక్షాల చూపు

చిత్రం
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరన్న సిద్ధాంతం వర్తించని పార్టీలు వామపక్షాలు మాత్రమే. ఒక్క బీజేపీ తో తప్ప ఎవరితో అయినా  పొత్తు కు సై అంటాయి ఆ పార్టీలు .అందుకే ఆ పార్టీల పై  ఇప్పటిదాకా జనానికి ఉన్ననమ్మకం క్రమం గా ఆవిరైపోతోంది . రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ పార్టీ లు క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే యోచనలో వున్నాయి. 2009 ఎన్నికల్లోబాబు తో జత కట్టి చావు దెబ్బతిన్నాయి. పరస్పరం కలహించుకున్నాయి. అప్పట్లో సేపేఐ నేత నారాయణ అయితే చిరు తో పొత్తు పెట్టు కోవాలని తహ తహ లాడారు.సీపీఎం ని కూడా ఒప్పించారు. అయితే ఆఖరు క్షణం లో బాబు ఢిల్లీ లెవెల్ లో రాజకీయం చేయడం తో తప్పనిసరిగా సైకిల్ ఎక్కారు. ఇపుడు రాష్ట్రం లోజగన్ హవా వీస్తుండటం తోవామపక్షాలు  జగన్‌ పార్టీకి దగ్గర అయ్యేందుకు ముచ్చట పడుతున్నాయనే  అభిప్రాయం వ్యక్తం అవుతోంది . కాంగ్రెస్‌, బీజేపీ పట్ల జగన్‌ తన వైఖరి ఏమిటో స్పష్టం చేస్తే  ఆయనతో కలసి పని చేసేందుకు సిద్ధం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నట్టు ఇదివరలోనే  ప్రచారం జరిగింద...