పోస్ట్‌లు

hazaruddin cricketer hazaruddi ayaajuddin india cricketer hot news sensational news special news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అజారుద్దీన్ కుమారుడికి తీవ్ర‌గాయాలు..

చిత్రం
మాజీ క్రిక‌ట‌ర్, ఎం.పి. అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్‌కి రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర‌గాయాల‌య్యాయి. అవుట‌ర్ రింగ్‌రోడ్డు గుండా బైక్‌పై అతివేగంతో వెళ్ళ‌డంతో పుప్పాల‌గూడా టోల్‌గేట్ ద‌గ్గ‌ర‌ ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలుపుతున్నారు. అయాజుద్దీన్‌తో పాటు అత‌ని స్నేహితుడు అద్నాన్ కూడా బైక్‌పై ఉన్న‌ట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల‌పాలైన వీరిని పోలీసులు అపోలో హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. వీరు బైక్ రేస్‌లో పాల్గొని అతివేగంతో బైక్ న‌డ‌ప‌టంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని పోలీసులు చెబుతున్నారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్టు స‌మాచారం. ఢిల్లీలో ఉన్న అజారుద్దీన్ త‌న కుమారుడి ప్ర‌మాద వార్త తెలియ‌గానే హుటాహుటిన హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. బైక్‌రేస్‌ల‌న్న‌వి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో ఈ సంఘ‌ట‌న ద్వారా తెలుస్తోంది.