చిరుకి మరో పరీక్ష పెట్టనున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి మరో పరీక్ష పెడతారా? అందుకు రంగం సిద్దం అవుతోందా? కాంగ్రెస్ వర్గాల భావన ప్రకారం జగన్ కు మద్దతుగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన ఇరవైఆరు మంది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే మొత్తం ప్రచార భారం అంతా మెగాస్టార్ చిరంజీవిపై పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయన సత్తా తేల్చడానికి ఇది ఒక అవకాశంగా కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఉప ఎన్నికలు వస్తే చిరంజీవి కీలకం అవుతారని ప్రచారం కూడా ఆరంభించారు. దానికి కారణం ఏమిటంటే ఈ ఇరవై ఆరు నియోజకవర్గాలలో పందొమ్మిది నియోజకవర్గాలలో ప్రజారాజ్యం పార్టీకి ఇరవైవేలు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. సాధారణ లెక్కల ప్రకారం చూస్తే, గత ఎన్నికలలో కాంగ్రెస్ కు, ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లను లెక్క వేస్తే కాంగ్రెస్ పార్టీ ఆటోమాటిక్ గా గెలవాలి. రాజకీయాలలో ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుందన్న గ్యారంటీ ఉండదు. పైగా జగన్ కు సానుభూతి ఉంటే దాని ప్రభావం అధికంగా సహజంగానే పడుతుంది. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలకు డిపాజిట్ పోవడంతో ఆ పార...