ఆపే శక్తి, ఇచ్చే శక్తి మాకు లేదు
వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ తరపున తెలంగాణ విషయంపై ఎలాంటి ప్రకటన చేస్తారని రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రత్యేక తెలంగాణ కి జై అంటే అటు సీమాంధ్ర ప్రాంతలో జగన్ వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడం, సమైఖ్యరాష్ట్రం అంటే ఇటు తెలంగాణలో వ్యతిరేకత ఏర్పడడం వెరసి జగన్ తెలంగాణ అంశంపై ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే జగన్ తానొవ్వక తప్పించక అన్నట్టుగా తెలంగాణ అంశాన్ని కేంద్రపై నెట్టి హమ్మయ్య అనిపించుకున్నారు. తెలంగాణ వస్తే ఆపే శక్తి, రాకపోతే ఇచ్చే శక్తి మాకు లేదని తేల్చి చెప్పారు.తెలంగాణ సమస్య సున్నితమైందని… ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ ఇచ్చే, ఆపే శక్తి తమకు లేదన్నారు. ఇరు ప్రాంతాల మనోభావాలకు అనుగుణంగా ఒక మంచి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర విషయంలో టీడీపీ, కాంగ్రెస్‌ల వైఖరిని జగన్ తప్పుబట్టారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు దాటవేత వైఖరి అవలంబి స్తున్నారని.. అలాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా నెపాన్ని రాష్ట్రంపై వేసి తప్ప...