కాంగ్రెస్ లో సోనియా మాటకే విలువ లేదా ?
సోనియా హామీ ఇచ్చినా పదవులు రావడం లేదంటే ఆమె మాటకు విలువ ఉన్నట్టా! లేనట్టా? అని గుంటూరు ఎంపీ రాయపాటి వారికీ సందేహమొచ్చింది.నేరుగా ఆమాట అనక పోయినా అదే అర్ధం తో సి ఏం కిరణ్ కి తగిలేలా రాయపాటి ప్రశ్నలు సంధిస్తున్నారు.అసలు విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి ఇస్తానని సాక్షాత్తూ సోనియాగాంధీ తనకు హామీ ఇచ్చారని, కానీ, అది నెరవేరలేదని రాయపాటి సాంబశివరావు ఆవేదన! దేవుడికి సేవ చేసుకుంటా అని విన్నవించుకున్న అవకాశం ఇవ్వలేదని రాయపాటి వాపోతున్నారు. . రాష్ట్ర ఎంపీల్లో కావూరి సాంబశివరావు, తానూ సీనియర్లమని, ఇద్దరికీ కేబినెట్ మంత్రి పదవి విషయంలో పోటీ నెలకొన్న నేపథ్యంలో గతంలో తాను సోనియాగాంధీని కలిశానని, కావూరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని, తాను రాష్ట్రంలో దేవుడికి సేవ చేసుకుంటానని చెప్పానని వెల్లడించారు. ఆ మేరకు సోనియా హామీ ఇచ్చారట. ఆ విషయాన్ని అహ్మద్ పటేల్ మూడుసార్లు సీఎం కిరణ్‌కు చెప్పారట. . తాను కిరణ్‌ను కలిసినప్పుడు మేడమ్ తిరిగి వచ్చాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారని,...