పోస్ట్‌లు

chandrababu naidu tdp national politicals lk adwani soniagandhi manmohan singh political news political gossips hot news hot gossips k tr taraka rama rao ys jagan ambati rambabu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నెల‌న్న‌ర‌లో వైఎస్సార్సీ మాయం..

చిత్రం
వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీ పార్టీ నెల‌న్న‌ర రోజుల వ్య‌వ‌ధిలో ప‌త‌న‌మ‌వుతుంద‌ని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు.  అక్ర‌మ ఆస్తుల కేసుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వైఎస్ జ‌గ‌న్‌ని త్వ‌ర‌లోనే పోలీసులు అరెస్టు చేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఈ మ‌ధ్యే వైఎస్సార్సీ అధికార ప్ర‌తినిథి అంబ‌టి రాంబాబుపై అమ్మాయిల‌ను లైంగికంగా వేధిస్తున్నార‌న్న వార్త‌లు కూడా బ‌య‌టికి పొక్క‌డం ఆ పార్టీకి కొద్దిగా న‌ష్టాన్ని క‌లిగించింద‌నే చెప్పొచ్చు.  సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ మేధోమదన సదస్సులో పాల్గొన్న చంద్ర‌బాబు విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.