ఎన్.టి.ఆర్ ఫాలోవర్ నాగం
ఎన్.టి.రామారావు ఏదైనా మాట చెబితే దానికి కట్టుబడి ఉండేవాడని, ఎప్పుడూ వెనక్కి తగ్గేవారు కారని ,అలాగే తాను కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిపైనే నిలబడతానని అంటున్నారు. డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి పట్టుబట్టి తాను శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదింప చేసుకున్నారు. అయితే దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన ఈ సమాధానం చెబుతున్నారు. తాను నిజమైన ఎన్.టి.ఆర్. అనుచరుడినని ఆయన చెబుతున్నారు. అంటే దానర్ధం మిగిలినవారు కారనా అంటే ఆయన ముసిముసి నవ్వుతున్నారు. విశేషం ఏమిటంటే 1995లో తెలుగుదేశంలో సంక్షోభం వచ్చినప్పుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి కూడా ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా చంద్రబాబు పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ అంశం పై పార్టీలో వివాదపడేవరకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు ఆస్తుల కేసు వచ్చినప్పుడు కూడా నాగం తన వ్యాఖ్యలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం విశేషం. తెలంగాణ అంశం తప్ప మిగిలిన వాటిలో తనకు పార్టీతో తగాదా లేదని అంటున్న...