ఇరకాటంలో టి-టిడిపి నేతలు
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మంగా తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ ను కలిసి తమ బస్ యాత్రకు మద్దతు ఇవ్వాలని కోరగా, కోదండరామ్ అంతకంటే వ్యూహాత్మంగా బస్ యాత్రను వాయిదా వేసుకోవలసిందిగా సలహా ఇచ్చి టిడిపివారిని ఇరుకున పడే శారు. గురువారం నుంచి బస్ యాత్రకు తెలుగుదేశం పార్టీ సన్నధ్దమైంది. తెలంగాణ తమ పట్టు నిలబెట్టుకోవడానికి ఇదే మార్గమని ఆ పార్టీ నాయ కులు భావించారు. అయితే తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ కేవలం టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటున్నారని విమర్శి స్తుంటారు. అయినప్పటికీ ఆయన వద్దకు వెళ్లి మద్దతు కోరాలని భావించారు.తద్వారా కోదండ రామ్ మద్దతు ఇస్తే అది సహజంగానే టిఆర్ఎస్ కు ఇరకాటం అవుతుంది. మద్దతు ఇవ్వకుంటే కోదండరామ్ ను విమర్శిం చవచ్చన్నది టిడిపి వ్యూహం కావచ్చు. ఆ మేరకు టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు బృందం కోదండరామ్ వద్దకు వెళ్లి చర్చలు జరిపింది. కోదండరామ్ వారికి ఇంకో ప్రతిపాదన చేశారు. బస్ యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరితో కలిసి బస్ యాత్రం చేయవచ్చని, దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని అ...