పోస్ట్‌లు

maoist leader kishanji gaddar governor narasimhan political news political articls hot news hot articls political hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గ‌వ‌ర్న‌ర్ మృగం లాంటివాడు-గ‌ద్ద‌ర్‌

చిత్రం
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు ఉరఫ్ కిషన్‌జీ మృతదేహం వద్ద ప్రజా గాయకుడు గద్దర్, విప్లవ రచయిత వరవరరావు, వేదకుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ మనిషి రక్తం తాగే మృగం లాంటివాడు గవర్నర్ నరసింహన్ అని అన్నారు. కిషన్ జీతో కలిసి తాను కూడా 40 రోజులపాటు మిలటరీ శిక్షణ పొందినట్లు తెలిపారు. గవర్నర్ కు, ప్రభుత్వానికి దమ్ముంటే తనని జైల్లో పెట్టాలన్నారు. తెలంగాణ కోసం కిషన్ జీ ఎంచుకున్న పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. నక్సలైట్లు దేశభక్తులు అన్న మమతా బెనర్జీ, కిషన్ జీని చంపించడంతో ఆమె నైజం ఏంటో వెల్లడైందన్నారు. వరవరరావు మాట్లాడుతూ కిషన్ జీని అతి దారుణంగా హత్య చేశారన్నారు. శరీరం అంతా కుళ్లబొడిచారని చెప్పారు. శనివారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కిషన్ జీ భౌతికకాయాన్ని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలించారు. ఈరోజు ఇక్కడి చందాపల్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కిషన్ జీ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.