పోస్ట్‌లు

gali janardhan reddy arrest srinivasa reddy cbi enquiry cbi jd lakshminarayana karnataka news ballaram mining sriramulu bjp yadyurappa hot news political news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ద‌య‌నీయ‌స్థితిలో గాలి

చిత్రం
ఎంతలో ఎంత దారుణమైన పరిస్థితి. ఇన్నేళ్లు తను అక్రమంగానో, సక్రమంగానో సంపాదించిన సంపదతో కను సైగ చేస్తే సేవ చేసే సేవకులు, హంస తూలికా తల్పాలు, స్వర్ణంతో నిండిన ఇల్లు, ఎసిలు తప్ప స్వేదం తెలియని వ్యక్తి.. ఇప్పుడు ఏమాత్రం సదుపాయం లేని, కనీసం పరుపుకాని, దిండుకాని లేని పోలీసు ఠాణ సెల్ లో గడపవలసిన దుస్థితి. గంటల తరబడి సిబిఐ అధికారులు ప్రశ్నిస్తుంటే దిక్కుతోచని స్థితిలో ఉండవలసిన ఖర్మ పట్టింది. ఎన్నివేల కోట్లు సంపాదిస్తే ఏమి లాభం. ఇలాంటి ఖర్మ పట్టింది. ఇది కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కి పట్టిన దౌర్బాగ్య పరిస్థితి. చివరికి ఆయన కాని, ఆయన సమీప బందువు ఒఎమ్సి ఎమ్.డి శ్రీనివాసరెడ్డిలను సిబిఐ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదే పెద్ద హింసగా భావించవచ్చు. ఆ తర్వాత నగరంలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ ఒక సెల్ లో పెడుతున్నారు. అక్కడ కనీస సదుపాయాలు ఉండడం లేదని గాలి జనార్ధనరెడ్డి సిబిఐ కోర్టుకు ఫిర్యాదు చేశారు. తమకు క...

గాలికి మ‌ళ్లీ చుక్కెదురు..

చిత్రం
కర్నాటక మాజీ మంత్రి గాలిజనార్ధనరెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు బెయిల్ తిరస్కరించింది. రెండు రోజులపాటు గాలి బెయిల్ వాదోపవాదాలు జరిగాయి. అంతేకా ఈ నెల పందొమ్మిదో తేదీ వరకు గాలి జనార్ధనరెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని సిబిఐ కస్టడి ఇవ్వడానికి కూడా జడ్జి ఆదేశాలు ఇచ్చారు. గాలి జనార్ధనరెడ్డి నుంచి అనేక విషయాలు రాబట్టవలసిన అవసరం ఉన్నందున వారిద్దరిని తమ విచారణార్ధం కస్టడికి ఇవ్వవలసిందిగా సిబిఐ న్యాయవాది వాదించారు. గాలి జనార్ధనరెడ్డి కోసం ప్రత్యేకంగా జోధ్ పూర్ నుంచి న్యాయవాది ప్రత్యేక విమానంలో రావడం సంచలనం సృష్టించింది. అయినప్పట్టికీ గాలికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

కిరీటం వెన‌క్కి ఇచ్చేది లేదు..!

చిత్రం
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి సమర్పించిన బంగారు, వజ్రాల కిరీటం తిరిగి వెనక్కి ఇవ్వడం సాధ్యపడదని తిరుమల,తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. ఒకసారి భక్తులు ఇచ్చిన కానుకలు ఏవీ వెనక్కి ఎట్టి పరిస్థితిలోను ఇవ్వడం జరగదని,ఈ బంగారు కిరీటం విషయం లోను అంతేనని ఆయన స్పష్టం చేశారు. నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఈ కిరీటాన్ని గాలి జనార్ధనరెడ్డికి వెనక్కి ఇచ్చి వేయాలని కొందరు డిమాండు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న జనార్ధనరెడ్డి తిరుమల, అలాగే శ్రీకాళహస్తి ఆలయాలకు ఆభరణాలు సమర్పించారు. శ్రీకాళహస్తి కి కూడా కోట్ల విలువైన ఆభరణాలు సమర్పించారు.కొన్ని రాజకీయ పక్షాలు గాలి సమర్పించిన కిరీటం వెనక్కి ఇవ్వాలంటూ తిరుపతిలో ప్రదర్శనలు కూడా నిర్వహించాయి.కాని అది సాధ్య పడదని టిటిడి స్పష్టం చేసింది.

ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌లు..

చిత్రం
ఓబులాపురం అక్ర‌మ మైనింగ్ కేసులో అరెస్ట‌యిన గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి అరెస్టు వెనుక ఎవ‌రి హ‌స్తం వుంది…?  బిజెపిలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగి మైనింగ్‌కింగ్‌గా పేరు సంపాదించుకున్న గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి చివ‌రికి జైలు ఊచ‌లు లెక్క‌పెట్టుకొనేలా చేసేది ఎవ‌రు..? ఇక రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస్తుల‌పై సిబిఐ అధికారుల దాడుల వెనుక ఎవ‌రి హ‌స్తం ఉంది..?  వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మ ఆస్తుల లెక్క తేల్చాల‌ని ఆ త‌ర్వాత జ‌గ్‌ని జైలుకి పంపాల‌ని యోచిస్తున్న‌ది ఎవ‌రు..? సూక్ష్మంగా ఆలోచిస్తే గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిల కేసుల‌ని ప‌రిశీలిస్తే.. వీటి వెనుక బ‌ల‌మైన హ‌స్తాలే ప‌నిచేస్తున్న‌ట్ట‌నిపిస్తుంది. బిజెపిలో ఎంతో ప‌లుకుబ‌డి క‌లిగిన నాయ‌కుడు, క‌ర్నాట‌క‌లో బిజెపి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డానికి, బిఎస్‌. య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా కావ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి, మ‌రి అలాంటి వ్య‌క్తిని సిబిఐ అధికారులు అరెస్టు చేస్తుంటే బిజెపి అధిష్టానం ఎందుకు నిమ్మ‌కు నీరెత్త‌...

19 వ‌ర‌కు రిమాండ్ విధించిన కోర్టు

చిత్రం
గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను రెండు వారాల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ.. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో.. దాదాపు 40 నిముషాల పాటు.. వాద ప్రతివాదనలు జరిగాయి. ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి సీబీఐ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేశారని.. అయితే మైనింగ్ విషయాల్లో ఏదైనా అక్రమాలు జరిగితే.. ఓఎంసీ ఎండీ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోవచ్చు కానీ.. గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేయడం సమంజసం కాదని.. గాలి తరపు లాయర్లు వాదించారు. మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి పేరును అక్రమంగా చేర్చారని వాదించారు. గాలిని అరెస్టు చేయడమే తప్పని వాదించారు. ఇది పూర్తి రాజకీయ కుట్ర అని.. అప్రజాస్వామికం అని గాలి తరపు న్యాయవాది వాదించారు. కాగా.. అయితే దీనిపై సీబీఐ తరపు న్యాయవాది మాత్రం.. మైనింగ్ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారని గాలి జనార్ధన్ రెడ్డిపై చాలా ఆరోపణలున్నాయని.. తమ కస్టడీకి అప్పగిస్తే.. మరిన్ని నిజాలు బయటపడతాయని కోర్టును కోరారు. అక్రమ మైనింగ్ ద్వారా వేలాది కోట్లను సంపాదించి...

గాలికి ఎదురుగాలి

చిత్రం
మైనింగ్ కంపెనీల‌ని త‌న గుప్పెట్లో పెట్టుకుని వేల‌కోట్ల రూపాయ‌లు సంపాదించిన ఘ‌నుడు. క‌ర్నాట‌క ప్ర‌భుత్వానికి స‌మాంత‌రంగా తాను ప్ర‌భుత్వం న‌డ‌ప‌గ‌లిగిన వ్య‌క్తి. బ‌ళ్ళారి మైనింగ్ కంపెనీల‌లో అధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ ఎన్నో అక్ర‌మాల‌ని పాల్ప‌డిన‌ట్టు గాలి జ‌నార్థ‌న్‌పై అభియోగం. అయితే అప్పుడు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి క‌ర్నాట‌క మంత్రిగా ఉండ‌డంతో య‌ధేచ్చ‌గా అధికారాన్ని దుర్వినియోగ ప‌రుచుకుని త‌న అక్ర‌మ సామ్రాజ్య‌న్ని విస్త‌రించుకున్నాడు. క‌ర్నాట‌క రాష్ట్ర రాజ‌కీయాల్లో గాలి సోద‌రులు చాలా కీల‌క‌మైన వ్య‌క్తులు. ముఖ్య‌మంత్రిగా ఎవ‌రున్న‌ప్ప‌టికీ గాలి సోద‌రుల క‌నుస‌న్న‌ల‌లోని అన్ని వ్య‌వ‌హారాలు జ‌రుగుతుంటాయ‌న్న‌ది బ‌హిరంగ‌ర‌హ‌స్యం. ఇంత ప‌ట్టు ఉండ‌డం వ‌ల్లే ప్ర‌భుత్వ అధికారుల అండ‌దండ‌ల‌తో య‌ధేచ్చ‌గా అక్ర‌మ మైనింగ్ కొన‌సాగించాడు. దీంతో క‌ర్నాట‌క ప్ర‌భుత్వ ఖ‌జానాకు 16,805 వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింద‌ని లోకాయుక్త తేల్చిచెప్పింది. దీంతో రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు అదేశాల‌తో సిబిఐ అధికారులు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి చేసిన అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చే ...

గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి అరెస్టు

చిత్రం
క‌ర్నాట‌క మాజీ మంత్రి, గాలి జ‌నార్థ‌న్‌రెడ్డిని సిబిఐ అధికారులు సోమ‌వారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఆయ‌న ఇంట్లో అరెస్టు చేశారు. అలాగే ఓఎంసీ ఎండి శ్రీ‌నివాస‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు.  బ‌ళ్ళారిలో అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన‌ట్టు ఈ మ‌ధ్యే లోకాయుక్త తేల్చిచెప్పింది. ఈ నేప‌థ్యంలోనే సిబిఐ అధికారులు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డిని, శ్రీ‌నివాస‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయ‌న‌పై 120(బి), 420, మైనింగ్, ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేశారు.  సిబిఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో బెంగుళూరు, బ‌ళ్లారిల‌లో ఉన్న‌ గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి ఇళ్ళ‌ల్లో సిబిఐ అధికారులు ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల‌లో విలువైన డాక్యుమెంట్స్ ని కొన్నింటిని సిబిఐ అధికారులు చేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. య‌డ్యూర‌ప్ప కేబినెట్‌లో గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి మంత్రిగా ప‌నిచేసారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం సిబిఐ కోర్టులో గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి హాజ‌రుపరిచే అవ‌కాశం ఉంది. గాలి జ‌నార్థ్‌రెడ్డికి హైకోర్టు ముంద‌స్తు బెయిల్ నిరాక‌రించింది. అలాగే గాలి బ్ర‌ద‌ర్స్‌కి సంబంధించిన హెలికాప్ట‌ర్‌న...