గాలికి ఎదురుగాలి


మైనింగ్ కంపెనీల‌ని త‌న గుప్పెట్లో పెట్టుకుని వేల‌కోట్ల రూపాయ‌లు సంపాదించిన ఘ‌నుడు. క‌ర్నాట‌క ప్ర‌భుత్వానికి స‌మాంత‌రంగా తాను ప్ర‌భుత్వం న‌డ‌ప‌గ‌లిగిన వ్య‌క్తి. బ‌ళ్ళారి మైనింగ్ కంపెనీల‌లో అధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ ఎన్నో అక్ర‌మాల‌ని పాల్ప‌డిన‌ట్టు గాలి జ‌నార్థ‌న్‌పై అభియోగం. అయితే అప్పుడు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి క‌ర్నాట‌క మంత్రిగా ఉండ‌డంతో య‌ధేచ్చ‌గా అధికారాన్ని దుర్వినియోగ ప‌రుచుకుని త‌న అక్ర‌మ సామ్రాజ్య‌న్ని విస్త‌రించుకున్నాడు. క‌ర్నాట‌క రాష్ట్ర రాజ‌కీయాల్లో గాలి సోద‌రులు చాలా కీల‌క‌మైన వ్య‌క్తులు. ముఖ్య‌మంత్రిగా ఎవ‌రున్న‌ప్ప‌టికీ గాలి సోద‌రుల క‌నుస‌న్న‌ల‌లోని అన్ని వ్య‌వ‌హారాలు జ‌రుగుతుంటాయ‌న్న‌ది బ‌హిరంగ‌ర‌హ‌స్యం. ఇంత ప‌ట్టు ఉండ‌డం వ‌ల్లే ప్ర‌భుత్వ అధికారుల అండ‌దండ‌ల‌తో య‌ధేచ్చ‌గా అక్ర‌మ మైనింగ్ కొన‌సాగించాడు. దీంతో క‌ర్నాట‌క ప్ర‌భుత్వ ఖ‌జానాకు 16,805 వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింద‌ని లోకాయుక్త తేల్చిచెప్పింది. దీంతో రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు అదేశాల‌తో సిబిఐ అధికారులు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి చేసిన అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌స్తుత గాలికి ఎదురుగాలి వీస్తోంది. మ‌రి గాలి అరెస్టు త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!