15ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తారా..?


ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న మార్కు పాల‌న‌ని కొన‌సాగించ‌డానికి పావులు క‌దుపుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌వ‌ల్ల‌నే అని, ప్ర‌స్తుతం ఉన్న అధికారం వైఎస్ చ‌ల‌వే అన్న విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం, అలాగే ప‌థ‌కాల అమ‌లులో కూడా ప్ర‌భుత్వం చిన్న చూపు చూస్తంద‌ని ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌ని ఆక‌ట్టుకునే ప‌థ‌కాల‌ని ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. దీంట్లో భాగంగానే వ‌చ్చే రెండేళ్ళ‌లో 15 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని, నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే సిఎం సీరియ‌స్‌గా ఏర్పాట్ల‌ని చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ ఆఫీసుల‌లో ఏ ఏ శాఖ‌లో ఎన్ని ఖాళీలున్నాయ‌న్న వివ‌రాల‌ను ఆయా శాఖ‌ల అధికారుల‌నుండి తీసుకున్నారు. ఈ ఏడాది చివ‌రిలోగా దాదాపు ల‌క్షా ప‌ద‌హారువేల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ని ఆదేశించారు. స్వ‌యానా ముఖ్య‌మంత్రివ‌ర్యులే సీరియ‌స్‌గా ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌డంతో అధికారులు కూడా ఈ ప్ర‌క్రియ‌ని వేగ‌వంతం చేశారు. అయితే ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ల‌క్ష‌కు పైచిలుకు ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డం బాగానే ఉన్న‌ప్ప‌టికీ వ‌చ్చే రెండేళ్ళ‌లో 15 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇవ్వ‌డం సాధ్య‌మేనా..? అస‌లు ప‌దిహేను ల‌క్ష‌ల ఖాళీలు ఉన్నాయా..? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఏదేమైన‌ప్ప‌టికీ ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ పోస్టుల భ‌ర్తీ లు వేగ‌వంతం చేయ‌డం మాత్రం నిరుద్యోగుల‌కు శుభ‌వార్తే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!