ప్రభుదేవాకి లైన్ క్టియర్ అయినట్టేనా..?
ప్రముఖ సినీనటుడు ప్రభుదేవ కు ఆయన భార్య రమాలత్ నుంచి విడాకులు ఇవ్వడానికి చెన్నైలోని సంబందిత కోర్టు ఆమోదం తెలి పింది.గురువారం నాడు తుది ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు.గత వారమే విడాకుల కేసు పూర్తి కావలసి ఉన్నప్పటికి, తన కొడుకుకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి రమ రాకపోవడంతో, అలాగే ప్రభుదేవా కూడా షూటింగ్ కారణంగా రాలేదు. దాంతో కేసు వాయిదా పడింది. తర్వాత రెండు రోజులకు వారిద్దరు హాజరయ్యారు.గత ఏడాది జూలైలో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నా రు. తాను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం జూలై పదో తేదీన విదేశాలకు వెళ్లవలసి ఉన్నందున ఈలోగా విడాకుల కేసును తేల్చవలసిం దిగా ప్రభుదేవా కోరారు.విశేషం ఏమిటంటే వీరిద్దరు సంతోషంగానే కనిపించారని చెబుతున్నారు.కోర్టు లో కేసు నడుస్తున్నంతసేపు ఇద్దరూ చిరునవ్వు తో ఉన్నారట.పది లక్షల రూపాయల డిపాజిట్ తోపాటు, మూడు ఇళ్లు రాసివ్వడానికి ప్రభుదేవా అంగీకరించారు ఆర్ధికంగా సెటిల్ చేసినందుకా? లేక కేవలం ఇది సాంకేతికంగా తీసుకునే విడాకులా అన్న సందేహాలు రావచ్చనుకోండి..అయితే ప్రభుదేవ ప్రముఖ నటి నయనతారను వివాహమాడతారా? అది ఎప్పుడు జరుగుతుంది ?...