దీక్షకు రెడీ అవుతున్న కేసీఆర్..?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు తనపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకునో, లేక వ్యూహాత్మ కంగానో వాటిని తిప్పికొట్టడానికో తెరపైకి ప్రముఖంగా వచ్చారు. ఒక డైరీ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత మళ్లీ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ప్రకటించారు. వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నామే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని నిలిపివేయలేదని ఆయన స్పష్టం చేశారు.తెలుగుదేశం నేతలు కుక్కల కంటే హీనమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అవసరమైతే మరోసారి ఆమరణ దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే పరిస్థితులు మళ్లీ తీవ్రం అవుతాయా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.సకల జనుల సమ్మె కారణంగా తెలంగాణ ఉద్యమం కొంత దెబ్బ తిన్నదని చెప్పాలి. సకల జనుల సమ్మె వ్యూహ రీత్యా సరైనదే అయినా, దానిని సకాలంలో విరమిస్తున్నట్లు ప్రకటించినా ఉద్యమ నేతలకు పేరు వచ్చేది. అలా కాకుండా జనం నష్టపోయినా ఫర్వాలేదన్నట్లు వ్యవహరించడంతో దెబ్బతిన్నారు. ఈ నేపధ్యంలో కెసిఆర్ మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారు. మరి ప్రజలలో ఎలాంటి ...