క్లాస్‌లో సూపర్.. మరి మాస్‌లో..?
జోష్ సినిమాతో తెరపైకి వచ్చిన హీరో నాగ చైతన్య ఆ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ ఏమాయ చేసావే చిత్రం ఘనవిజయంతో క్లాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన నటించిన 100 పర్సంట్ లవ్ చిత్ర కూడా విజయం సాధించడంతో ఇక నాగచైతన్యం క్లాస్ హీరోగా ఫిక్సయిపోయాడు. కానీ తన తండ్రి నాగార్జున లాగా క్లాస్‌తోపాటు మాస్ హీరోగా కూడా పేరు తెచ్చుకోవాలని నాగచైతన్య తెగ ఆరాట పడుతున్నాడు. రాంగోపాల్‌వర్మ శివ చిత్రంతో నాగార్జున మాస్ హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రంతో మాస్ హీరోగా ఓ వెలుగు వెలగాలని ఆరాటపడుతున్నాడు. నాగార్జునకి శివ చిత్రంద్వారా ఇండస్ట్రీ రికార్డ్ హిట్ ఇచ్చిన రాంగోపాల్‌వర్మ నాగచైతన్యకి కూడా ఆస్థాయి విజయాన్ని అందిస్తాడా.. అన్నది వేచి చూడాలి.