పోస్ట్‌లు

pavan kalyan kalkatta vishnuvardhan shadow kaali telugu movies movie reviews tollywood movies hot news movie gossips movie articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప‌వ‌న్ షాడో కాదు.. కాళీ..!

చిత్రం
ప‌వ‌న్‌క‌ళ్యాన్ తాజా చిత్రం టైటిల్ మారింది.. ఇంత‌వ‌ర‌కూ ఈ చిత్రానికి షాడోగా టైటిల్ ఖ‌రార‌యింద‌ని భావించారు. అయితే ఎందుకో ఆ పేరుని తీసేసి కాళీగా టైటిల్ మార్చార‌ని తెలుస్తోంది. నెల రోజుల నుండి క‌ల‌క‌త్తాలో నిర్విరామంగా ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. త‌మిళ డైరెక్ట‌ర్ విష్ణువ‌ర్ధ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాని స్టైలిష్‌గా రూపొందిస్తాడ‌ని ద‌ర్శ‌కుడు విష్ణువ‌ర్థ‌న్‌కి మంచి పేరుంది. తెలుగులో మొద‌టిసారిగానే స్టార్ హీరో ప‌వ‌న్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డం, ఈ చిత్రంలో ప‌వ‌న్‌ని స్టైలిష్‌గా చూపించ‌డానికి విష్ణ‌వుర్థ‌న్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయ‌న అనుకున్న‌ట్టుగానే ప‌వ‌న్ స్టైలిష్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్టు ఈ చిత్రం స్టిల్స్ చూస్తుంటే తెలుస్తోంది. లైట్ గ‌డ్డంతో ఇంత‌కు ముందు చిత్రాల‌కి భిన్నంగా న్యూలుక్ ఇచ్చేలా ప‌వ‌న్ జాగ్ర‌త్త తీసుకుంటున్నాడు. ఇంత‌కుముందు క‌ల‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌తో వ‌చ్చిన ఖుషీ చిత్రం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే.. అదే సెంటిమెంటుతో ఈ చిత్రాన్ని క‌ల‌క‌త్తాలో షూటింగ్ చేస్తున్నారు.. మ‌రి ఈ కాళీ చిత...