మంత్రి కాన్వాయ్ పై రాళ్ళు..!
ఉప ముఖ్యమంత్రి అవుతారనుకున్న దామోదర రాజనర్సింహపై తెలంగాణ జేఏసీకి సంబంధిన కొందరు దాడి చేయడం రాళ్లు విసరడం కాస్త సంచలనంగానే ఉంది. ఆదివారం రోజు నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ మంత్రి దామోదర్‌రాజనర్సింహకు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడం ఆయన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉప ముఖ్యమంత్రి కానీయమని ప్రకటించడంతో.. ఈ దాడి జరగడానికి ప్రాముఖ్యత ఏర్పడింది. దామోదర్ రాజనర్సింహను సమైక్యవాదిగా మధుయాష్కి ముద్రవేశారు. బహుదా దాని ప్రభావమో.. మరే కారణమో తెలీదు కానీ మరుసటి రోజే రంగారెడ్డి జిల్లా వికారాబాద్ దగ్గర కొందరు దాడి చేయడానికి ప్రయత్నించడం.. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జీ చేసి వాళ్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా మంత్రికి నిరసన చెప్పడంలో ఆక్షేపణ లేదుకానీ మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోడానికి ప్రయత్నించడం, రాళ్లు విసరడం వంటివి అంత మంచివి కావని చెప్పాలి.