గాలి వర్గం కాంగ్రెస్ కు దగ్గర అవుతుందా!
అక్రమ ఖనిజ మైనింగ్ కేసులో జైలుపాలైన గాలి జనార్ధనరెడ్డి మెల్లగా కాంగ్రెస్ కు దగ్గరవుతారా? రాజకీయ వర్గాలో ఆసక్తికరమైన ప్రచారం ఒకటి జరుగుతోంది. కర్నాటకలో బిజెపితో సంబంధాలు తెంచుకోవడం, కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా సిబిఐ గండం నుంచి బయటపడడం కోసం గాలి జనార్ధనరెడ్డి సన్నిహితులు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కర్నాటకలో ఈయన మద్దతుదారుడైన మాజీ మంత్రి శ్రీరాములుకు మద్దతు ఇస్తున్న ఇద్దరు బిజెపి ఎమ్.పిలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అంతేకాక భవిష్యత్తులో సుమారు పది మంది బిజెపి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు తిప్పడంలో గాలి సన్నిహితులు ముఖ్య భూమిక పోషించవచ్చని భావిస్తున్నారు. తద్వారా కర్నాటకలో బిజెపిని బలహీనపర్చడానికి గాలిని ఒక పావుగా కాంగ్రెస్ ప్రయోగించవచ్చని అంటున్నారు. దీనికి తగినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ వర్గంలో ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సొంత గూటికి పంపించడానికి కూడా ప్రయత్నాలు ఆరంభమయ్యాయని అంటున్నారు. గాలి జనార్ధనరెడ్డి సమీప బందువైన పాణ్యం సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ కు ద...