అఫీషియల్‌గా ప్రకటిస్తేనే తప్ప..
తెలంగాణ అంశంపై ఎమ్.పిలు నాయకత్వం తీసుకున్నారని సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిదులు రాజీనా మాలు చేశారని, తెలంగాణ ఇస్తే తప్ప రాజీలేదని చెప్పామని , అయితే ప్రక్రియ సాగ డానికి తాము కేంద్రానికి సహకరిస్తు న్నామని ఆయన అన్నారు.తెలంగాణపై రాజీ ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.నల్లగొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియను అదికారికంగా ఆలోచిస్తే తప్ప తమ రాజీనామాలు ఉపసంహరించే ప్రసక్తి లేదని అన్నారు. ఇప్పటికే తెలంగాణ సాధనకోసం వందలమంది బలిదానం చేసిన సంగతి తెలియదా అని కావూరి సాంబశివరావును ప్రశ్నించారు. తాము కూడా ప్రాణాలివ్వడానికే సిద్దంగా ఉన్నామని అధిష్టానానికి తెలియచేశామన్నారు. బ్యాంకులను మోసం చేసిన కావూరి సాంబశివరావు ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని అన్నారు. తెలంగాణలో ఇలా మోసం చేసే నాయకులు లేరని ఆయన అన్నారు. కావూరి స్వార్ధచింతనతో చేస్తున్న సమైక్య రాష్ట్రం కోరుతున్నారని, వీరి వలలో ఆ ప్రాంత విద్యార్దులు పడరాదని అన్నారు. నిజాం విముక్తి పోరాటం లో పాల్గొన్న విదంగా నే తెలంగాణ విముక్తికోస...