పోస్ట్‌లు

kcr trs kodandaram telangana tdp congress jagan chiranjeevi k. chandrashekar rao లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రణ గర్జనతో టిడిపి తెలంగాణ వాదం బ‌ల‌ప‌డిందా..?

చిత్రం
అడుగడుగునా టీఆర్ఎస్ అడ్డంకులు.. దానికి తోడు భారీ వ‌ర్షంతో తాండూరులో నిర్వ‌హించిన ర‌ణ‌గ‌ర్జ‌న సభను విజ‌య‌వంతం చేసుకున్నారు టిడిపి, తెలంగాణ నాయ‌కులు. వికారాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ నేతల కాన్వాయ్‌లోని వాహనాలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దాంతో టీఆర్ ఎస్‌, టీడీపీ నాయకుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. భారీగా వ‌ర్షం ప‌డుతున్నా, ర‌ణ‌గ‌ర్జ‌ణ స‌భ‌లో టిడిపి సీనియ‌ర్ నాయ‌కులంద‌రూ ప్ర‌సంగించారు. ముఖ్యంగా టిఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌, తెలంగాణ జేఏసీ క‌న్వీన‌ర్ కోదండ‌రాంల‌పై విరుచుకుప‌డ్డారు. ధైర్యముంటే రౌండ్ టేబుల్ సమావేశానికి పిలవాలని, కేసీఆర్‌ను తాము కొన్ని ప్రశ్నలడుగుతామని సవాల్ విసిరారు. ముందుంది మొసళ్ల పండుగ అంటూ హెచ్చరించారు. తెలంగాణ వస్తే తాము జీరోలమవుతామన్న భయంతోనే కేసీఆర్ ఉద్యమానికి అడ్డుపడుతున్నాడని ఆక్షేపించారు. తాండూరు సభలో విమర్శలకు పదును పెట్టడంతోపాటు ప్రశ్నలు సంధించడంద్వారా టీఆర్ఎస్, జేఏసీలను ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. ఉద్యమం పేరుతోనే కేసీఆర్ పదేళ్లనుంచి బతికేస్తున్నాడని, తెలంగాణను సాధించడం కేసీఆ...

కోదండరామ్ కు క్లాస్ పీకిన కెసిఆర్

చిత్రం
తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ ఛైర్మన్ కోదండరామ్ కు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుక్లాస్ పీకారు. ఈ కమిటీ కార్యాలయం ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు క్వార్టర్ లో ఉంది. అక్కడ నుంచే కోదండరామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.వెంటనే ఎర్రబెల్లి క్వార్టర్ ను ఖాళీ చేసి ఒక అపార్టుమెంట్ ను అద్దెకు తీసుకోవాలని కెసిఆర్ సూచించారు. దానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని అఆయన అన్నారు. అలాగే నాగం జనార్ధనరెడ్డి సభకు కొందరు జెఎసి నేతలు వెళ్లడం పై కూడా కెసిఆర్ మండిపడ్డారు. ఆ సభకు వెళ్లవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణ జెఎసి అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా నడవడానికి కెసిఆర్ ఇష్ట పడుతున్నట్లు లేదు. జెఎసిని తన అధీనంలోనే నడపాలన్న ధోరణి కనపడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.