పోస్ట్‌లు

bothsa satyanarayana t-congress leaders janareddy keshavarao sarvay satyanarayana ponnam prabhakar komatireddy venkata reddy saperate telangana political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తిరిగివ‌స్తారా.. సిద్దమ‌వుతారా..?

చిత్రం
దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని సిబిఐ దోషిగా నిల‌బెట్టినందుకు నిర‌స‌న‌గా వైఎస్ జ‌గ‌న్‌కి స‌పోర్ట్‌గా ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కి రాజీనామాలు చేసిన వారికి కాంగ్రెస్ వ‌ర్గాలు ఓ ఆఫ‌ర్ ముందుంచింది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా పున‌రాలోచించుకుని త‌మ రాజీనామాల‌ని వెన‌క్కితీసుకోవాల‌ని, అలా చేస్తే వారిపై అన‌ర్హత వేటుని వేయ‌బోమ‌ని ప్రక‌టించారు. ఈ ఆఫ‌ర్‌ని తిర‌స్కరిస్తే ఉప ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని కూడా హెచ్చరించారు. జ‌గ‌న్‌ని స‌పోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కోరిన‌ట్లుగా ఎమ్మెల్యే ప‌ద‌వుల‌లో తిరిగి కొన‌సాగుతారా..?  లేదంటే జ‌గ‌న్‌నే న‌మ్ముకుని రాజీనామాల‌నే కోరుకుంటారా..? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. అవినీతి ఆరోప‌ణ‌ఫ‌ల‌తో సిబిఐ విచార‌ణ ఎదుర్కొంటున్న వైఎస్ జ‌గ‌న్ ఏ క్షణంలోనైనా జైలుకి వెళ్తార‌నే ఊహాగానాలు ఊపందుకోవ‌టంతో, గ‌జ‌న్‌కి స‌పోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఏం చేయ‌బోతార‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

వార‌సుల‌తో వ‌ర్కవుట్ అయ్యేనా..?

చిత్రం
పిసిసి అధ్యక్షుడు కొత్త ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో ప్రముఖులుగా ఉంటున్నవారి పిల్లలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు ఆకర్షితులు కాకుండా ఉండడానికి చేసిన ఆయన వ్యూహం ఫలిస్తుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఎరాసు ప్రతాపరెడ్డి, ముకేష్ గౌడ్, విశ్వరూప్ ల కుమారులు కార్తీక్ రెడ్డి, ఫణింద్ర, రామ్ మనో హర్ నాయుడు, అరవింద రెడ్డి, విక్రమగౌడ్, క్రిష్ణలను బొత్స పిలిపించుకుని బొత్స సంప్రదింపులు జరిపారు. అలాగే సికింద్రాబాద్ ఎమ్.పి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్, పటాన్ చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు అశిష్, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కుమారుడు శ్రావణ్ లు కూడా బొత్సతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లోనే భవిష్యత్తు ఉంటుందని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి కృషి చేయాలని బొత్స కోరారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులను కాదని ఇప్పటికిప్పుడు వారు మాత్రం ఎందుకు వెళతారన్న ప్రశ్న వస్తుం...

స‌మైఖ్యంగా లేకుంటే స‌మ‌ర‌మే..!

చిత్రం
రాజకీయ అధికారం కోసమే తెలంగాణ ఉద్యమం జరుగుతోందని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యంగా సీమాంధ్రులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉద్యమం నడుస్తోందని ఆయన చెప్పు కొచ్చారు. తెలంగాణ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రత్యేక ఉద్యమం కనబడదన్నారు. నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన బొత్స కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు.. అధికారం ఉంటే.. ఉద్యమాలు పోతాయని చెప్పుకొచ్చారు. నేతల అధికారం కోసమే ప్రాంతీయ ఉద్యమాలు జరుగుతున్నాయ న్నారు. తానెవరిపై కించపరిచేలా వ్యాఖ్యలు కానీ.. ఎవరినీ తప్పుపట్టేలా మాట్లాడలేదన్నారు. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు జరుగుతాయని.. రాష్ట్రం విడిపోతే.. నీటి సమస్య తప్పక వస్తుందని జేసీ తెలిపారు. తమ ఉద్యమం నీటి కోసమే కానీ.. హైదరాబాద్ గురించి కాదన్నారు. రెండేళ్ల పాటు తెలంగాణ వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. సమస్య పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో జరిగే చర్చల్లో ప్రతిపాదిస్తామన్నారు. ఇక తెలంగాణ నేతల గురించి మాట్లాడుతూ.. వారు ఇప్పుడు ఊబిలో చిక్కుకుపోయారన్నారు. రాజీనామాలు వెనక్కి తీసుకుంటే.. ప్రజాగ్రహం తప్ప...