స‌మైఖ్యంగా లేకుంటే స‌మ‌ర‌మే..!

రాజకీయ అధికారం కోసమే తెలంగాణ ఉద్యమం జరుగుతోందని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యంగా సీమాంధ్రులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉద్యమం నడుస్తోందని ఆయన చెప్పు కొచ్చారు. తెలంగాణ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రత్యేక ఉద్యమం కనబడదన్నారు. నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన బొత్స కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు.. అధికారం ఉంటే.. ఉద్యమాలు పోతాయని చెప్పుకొచ్చారు. నేతల అధికారం కోసమే ప్రాంతీయ ఉద్యమాలు జరుగుతున్నాయ న్నారు. తానెవరిపై కించపరిచేలా వ్యాఖ్యలు కానీ.. ఎవరినీ తప్పుపట్టేలా మాట్లాడలేదన్నారు. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు జరుగుతాయని.. రాష్ట్రం విడిపోతే.. నీటి సమస్య తప్పక వస్తుందని జేసీ తెలిపారు. తమ ఉద్యమం నీటి కోసమే కానీ.. హైదరాబాద్ గురించి కాదన్నారు. రెండేళ్ల పాటు తెలంగాణ వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. సమస్య పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో జరిగే చర్చల్లో ప్రతిపాదిస్తామన్నారు. ఇక తెలంగాణ నేతల గురించి మాట్లాడుతూ.. వారు ఇప్పుడు ఊబిలో చిక్కుకుపోయారన్నారు. రాజీనామాలు వెనక్కి తీసుకుంటే.. ప్రజాగ్రహం తప్పదన్నారు. వారిపై సానుభూతి ఉందన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

జపాన్ రేడియేషన్ ఇండియాకు వచ్చేస్తోందా?