అన్ని వార్తలు ఒకలా ఉండవు
indian News,India Latest News | News, Hollywood news, Bollywood news, political satires,Movie News, News Portal, Music, Movie News, Hollywood,
IT news portal providing latest Information Technology news
ఈనాడు, సాక్షిల కోల్డ్ వార్..!
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు, సాక్షి అధిపతి జగన్మోహన్ రెడ్డికి, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావులకు మధ్య నిత్య యుద్దం రక్తి కట్టిస్తోంది. జగన్ ఆస్తులపై కోర్టు విచారణకు ఆదేశాలు ఇవ్వగానే, ఈనాడులో జగన్ ఆస్తుల కేసు అని రాయకుండా అక్రమ ఆస్తుల కేసు అని పెట్టి కధనాలు ఇచ్చింది. ఇక సాక్షి కూడా రామోజికి సంబంధించి చిన్న వివాదం దొరికినా పెద్ద ఎత్తున రాస్తూ సందడిచేస్తోంది. ఇద్దరి మధ్య సాగుతున్న ఈ యుధ్దం ఎప్పుడు ఏ రూపం దాల్చుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రామోజీరావుకు వ్యతిరేకంగా సాక్షి ఒక కధనాన్ని ఇస్తూ మార్గదర్శి కేసు తేలకుండానే ఆయన ఆస్తులు అమ్మకానికి పెట్టారంటూ ఒక పెద్ద కధనాన్ని ఇచ్చింది. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు మొదలైంది. అప్పట్లో ఈ కేసుపై రకరకాల కధనాలు రావడం, ఆదాయపన్ను శాఖ కేసు పెట్టడం, సిఐడి కూడా దీనిపై విచారణ చేయడం వంటివన్ని జరిగాయి. అకస్మాత్తుగా రాజశేఖరరెడ్డి మరణంతో ఆ కేసులన్నీ వెనుకబడ్డాయి. ఆ తర్వాత జగన్ వంతు వచ్చింది. జగన్ అక్రమ ఆస్తులు సంపాదించారంటూ , వై.ఎస్.జమానాలో జరిగిన ఆయా లావాదేవీలపై ఈనాడు పలుమార్లు కధనాలు వచ్చాయి. ఇది ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లి సిబిఐ విచారణ దశకు చేరింది.ఈ తరుణంలో సాక్షి ఒక కధనాన్ని ఇస్తూ రామోజీ మూడు కంపెనీలను బోగస్ చిరునామాలతో రిజిస్టర్ చేశారని ఆరోపించింది. సాక్షి లో పెట్టుబడులు పెట్టినవారిలో కొన్ని అడ్రస్ లు బోగస్ వని గతంలో ఈనాడు రాస్తే, ఇప్పుడు అదే ఆరోపణ రామోజీరావు ఎదుర్కోవలసి వచ్చింది.రామోజీ తనకున్న టివీ చానళ్లలో 11 చానళ్లను సోని సంస్థకు విక్రయించబోతున్నదన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో సాక్షిలో ఈ కధనాలు రావడం విశేషం.రామోజీ ఈటీవి తెలుగు, ఈటివి-2, చానళ్లను ఉషోదయ టెలివిజన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు, తెలుగేతర ప్రాంతీయ భాష చానళ్లు ఈటివి కన్నడ, ఒరియా, బంగ్లా, మరాఠి, గుజరాత్ చానళ్ల నిర్వహణకు ప్రిజమ్ , హింది, ఉర్దూ, చానళ్లను పనోరమ కు మళ్లించారని రాశారు.ప్రిజమ్, పనోరమ,టీవీ సంస్థల నమోదిత కార్యాలయాలు పూర్తిగా బోగస్ చిరునామాలలో ఉ్నాయని సాక్షి అభియోగం మోపుతోంది.కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణకు అనుమతి కోరుతూ హైకోర్టుకు పెట్టిన పిటిషన్ లో ఈ బోగస్ చిరునామాలున్నాయని రాసిన సాక్షి ఆ చిరునామాలను ప్రస్తావించలేదు.
దీనికి ఈనాడు సమాధానం ఇస్తుందా? లేక పట్టించుకోకుండా వదిలివేస్తుందా అన్నది చూడాలి.
ఈ శతాబ్దం నాదీ అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీకి ఒక శతాబ్దం నిండింది. మహాకవి 101వ జయంతి (శనివారం- 30-04-11) వేడుకల సందర్భంగా ఓసారి ఆ మహాకవిని స్మరించుకుందాం. .. కవితా మహర్షి మరో శతాబ్దిలోకి తన చైతన్యకాంతులను ప్రసరింపజేస్తున్నాడు. పాత పదాలకు కొత్త అర్థం కల్పించి కవిత్వానికి దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ . `ఆధునిక కవిత్వం అర్థంకాలేదంటే, ఆధునిక జీవితమే అర్థం కాలేదన్నమాట' అంటూ మోడర్న్ భావాలకు పెద్దపీట వేసిన దీర్ఘదర్శి మహాకవి శ్రీశ్రీ. అందుకేనేమో `పదండిముందుకు, పదండి తోసుకు '- అంటూ మరో ప్రపంచాన్ని ముందస్తుగానే చూపించాడు శ్రీశ్రీ. `రాబోవు యుగం నా యుగం అవుతుంది' అంటూ శాసించిన మహాకవి శ్రీశ్రీ. 1930 వరకు తెలుగుసాహిత్యం తనను నడిపిస్తే, ఆ తరువాత దాన్ని తానే నడిపించానంటూ సగర్వంగా చెప్పుకున్నవాడు శ్రీశ్రీ. అనతికాలంలోనే మహాకవిగా ఎదిగి తెలుగుసాహిత్యంలో మధ్యాహ్న భానుడిలా ప్రకాశించాడు శ్రీశ్రీ. `శ్రీశ్రీకంటే మిన్న- ఏదైనా వుంటే, అది శ్రీశ్రీ కవితే సుమా'- అన్నంతగా శ్రీశ్రీ కవితలు జనహృదయాల్లో నాటుకుపోయాయి. `భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను... స్మ...
బర్నింగ్ కామెంట్రీ - 5 .................................................. నగ్న పాచికల జూదం!! వయసువెన్నెల్లో తడిసి మెరిసిన సింగారం కాసుల కోసం `షార్ట్'కట్స్ లో వెండితెరపై ఆరేసిన అందం చూసేవాళ్ల కంటిమీద గ్యారెంటీగా కునుకు దూరం! ఇది నేడు హిట్ ల కోసం ఆడే నగ్న పాచికల జూదం!! ...
దోమల శృంగారంపై పూర్తి అవగాహన ఉంటే, డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, నిజమేనంటున్నారు అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలోని జీవరసాయన శాస్త్రవేత్తలు. ఆడెస్ ఈజిప్టీ దోమల సెక్స్ లో ఒక రకమైన రసాయన చర్యల పట్టికను శాస్త్రవేత్తలు గుర్తించారు. మగదోమ స్పెర్మ్ లో ఉండే వంద రకాల ప్రొటీన్లు ఆడదోమల్లోని లక్షణాల్లో శాశ్వత ప్రాతిపదికన మార్పులు తీసుకువస్తాయి. అవి ఆహారం (రక్తం) తీసుకునే విషయంలోనూ, అండాలను విడుదల చేయడంలోనూ, కలయక పద్ధతుల్లోనూ ఈ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడతాయట. మగ దోమల్లో అంతకు ముందు కూడా కొన్ని రకాల ప్రొటీన్లు గుర్తించినా, సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఏ తరహా ప్రొటీన్లు ఆడదోమలోకి స్పెర్మ్ ద్వారా పోతున్నాయో ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. ఈ ప్రొటీన్లను స్పష్టంగా గుర్తించడం వల్ల రాబోయే కాలంలో ఆడ దోమలు పుట్టకుండా చేయడానికి వీలుచిక్కుతుందనీ, అప్పుడు డెంగ్యూ, వెస్ట్ నిలే వంటి వైరస్ ల వల్ల మనుషుల్లో జ్వరాలు రాకుండా చూడవచ్చని కార్నెల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సంగతేమిటం...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి