అవి రాజకీయపార్టీలు కావు.. బ్లాక్‌మనీ బ్యాంకులు..
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని సామెత. మన దేశంలో చట్టాలు ఒకందుకు చేస్తే అవి మరొకందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో నల్లధనం గురించి ఆందోళన వ్యక్తం చేయని రాజకీయ పార్టీలేదు. నిజానికి ఎన్నికలలో నల్లధనాన్ని పెద్ద ఎత్తున ఖర్చుచేసే రాజకీయ పార్టీలే దీనిపై సుద్దులు చెబుతుంటాయి.అది వేరే విషయం. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ ప్రతిఏటా ఆదాయపన్నుశాఖకు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ప్రధాన రాజకీయ పార్టీలు అలాగే చేస్తుంటాయి. అయితే తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. కొన్ని రాజకీయ పార్టీలు నల్లధనాన్ని మెయిన్ టెయిన్ చేయడానికే పుట్టుకొచ్చాయని వెల్లడి అయింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.ఆ క్లాజును వాడుకుని తమ డబ్బును తెల్లధనంగా మార్చుకోవడానికి కొందరు పార్టీలనే రిజిస్టర్ చేశారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం పన్నెండు వందల రాజకీయ పార్టీలు నమోదైతే, వాటిలో మూడు వందల పార్టీలు అసలు ఆదాయపన్ను శాఖకు రిటరన్ ఇవ్వడం లేదు. తమిళ నాడు,పశ్చిమబెంగాల్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలోని పార్టీల పరిస్థితిని పరిశీలించాక అన్ని రాష్ట్రాలలోని పార్టీల పరిస్థితిని దర్యాప్తు చేయాలని కమిషన్ నిర్ణయించింది.నిజానికి పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు నమోదైనా, వీటిలో డెబ్బైఐదు శాతం నుంచి ఎనభై శాతం మేర అసలు ఎన్నికలలో పోటీనే చేయడం లేదు.పన్ను రాయితీ, విరాళాలు ఇచ్చినవారు, పుచ్చుకున్న పార్టీలు రెంటికి వర్తిస్తున్నందున ఈ పార్టీలు ఆ క్లాజును దుర్వినియోగం చేస్తున్నాయని ఛీఫ్ ఎన్నికల కమిషనర్ ఖురేషీ క కూడా వ్యాఖ్యానించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి