సుంద‌ర‌రాజ‌న్ మృతి కాక‌తాళీయ‌మేనా..?

కేరళ రాజధాని తిరువనంతపురంలో పద్మనాభస్వామి ఆలయం మరోసారి వార్తలలోకి వచ్చింది. అయితే ఈసారి ఆ దేవాలయంలో ఉన్న సంపద ద్వారా కాదు. ఆ సంపద వెలుగులోకి రావడానికి కారణమైన లాయర్ మరణం ద్వారా. దేవాలయం ట్రస్టీ అయిన రాజవంశీకులతో వచ్చిన చిన్న వివాదంలో లాయర్ సుందర్ రాజన్ కోర్టుకెక్కారు.ఆ దావా సుప్రింకోర్టు వరకు వెళ్లింది.సుప్రింకోర్టు దేవాలయంలోని భూగర్భంలో ఉన్న గదులను తెరవవలసిందిగా ఆదేశించింది.అందుకోసం ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో కమిటీని కూడా వేశారు.ఆ పరిణామం తో ఆలయ చరిత్రే మారిపోయింది.లక్ష కోట్ల విలువైన బంగారం, వజ్రవైఢూర్యాలు ఎన్నోవిలువైనవి దొరికాయి.అందులో పద్దెనిమిది అడుగుల బంగారు విగ్రహం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇంతటి గొప్ప విశేషానికి కారణమైన సుందర రాజన్ అకస్మాత్తుగా మరణించారు. అయితే ఇది అనారోగ్యం కారణంగా జరిగింది. కాని ఇప్పుడు సంప్రదాయవాదులు దీనికి గుడి రహస్య గదులు తెరవడానికి లింకు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరో గది నాగబంధం తోఉన్న తలుపులు కలిగి ఉన్నందున దానిని తెరవవద్దని సంప్రదాయవాదులు వాదిస్తున్నారు.దానిపై కోర్టు విచారణ కొనసాగుతోంది.ఈ నేపధ్యంలో సుందర్ రాజన్ మరణించడం ఓ విషాదం. ఆయన పోలీసు ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.ఆ తర్వాత లాయరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.సుందర్ రాజన్ మరణంతో ఏ పరిణామాలు ఎటువైపునకు దారి తీస్తాయో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!