స్వార్థం ముఖ్యమా..? ఆవేదన ముఖ్యమా..?
పది రోజుల్లో కేంద్రం తెలంగాణ ఇస్తానని మాట ఇస్తే ఢిల్లీ వెళతామని ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆజాద్ తన మాటలను వెనక్కి తీసుకున్న పక్షంలో చర్చలకు సిద్దమని చెప్పారు. ఢిల్లీ వెళ్లినా తెలంగాణ తప్ప దేనికీ ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ సాధన కోసం సీమాంధ్ర ఆర్థిక మూలాలు దెబ్బ తీయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సినిమాలు చూడవద్దని సూచించారు. రాజీవ్ రహదారి విస్తరణ పనులు అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణ ఇప్పుడు రాకుంటే మరెప్పుడూ రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. 200 మంది సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల స్వార్థం ముఖ్యమా, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆవేదన ముఖ్యమా అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. తెలంగణ ఇవ్వ కుంటే పరిపాలన స్తంభింప చేయడానికి సిద్ధమన్నారు. రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ సాధన కోసం ఈ నెల 20న మున్సిపల్ స్థాయిలో సామూహిక నిరాహార దీక్షలు కాంగ్రెసు చేపడుతుందని రాజ్య సభ సభ్యుడు కె కేశవరావు చెప్పారు. 26న జెండా పండుగ నిర్వహిస్తామన్నారు. కాంగ్రెసు జెండాలో తెలంగాణ జెండా ఉంచి ఎగుర వేయాలని సూచించారు. తెలంగాణపై ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకునే ప్రసక్తి లేదన్నారు. టి-కాంగ్రెసులో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాంగ్రెసుకు గ్రామీణ కార్యకర్తలే బలం అని వారు పట్టుగా ఉంటే తెలంగాణ సాధ్యమన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి