క‌ర్నూలులో జ‌గ‌న్ ఓదార్పు యాత్ర..

నేటినుంచి 13 రోజులపాటు కర్నూలులో యువనేత జగన్‌ ఓదార్పు ప్రారంభం కానుంది. ఈ 13 రోజుల‌లో  ఆయన 36 కుటుంబాలను పరామర్శిస్తారు. 13 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 1039 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. మొదటిరోజు చాగలమర్రి, ఆళ్ళగడ్డ, దోర్చిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో పర్యటించనున్న జగన్‌ ఆరు కుటుంబాలను పరామర్శిస్తారు. ఇదిలా ఉంటే తిరుపతి నుంచి కర్నూలు జిల్లాకు బయలుదేరిన యువనేత జగన్‌కు కడప జిల్లా రైల్వే కోడూరులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున స్టేషన్‌కు వచ్చిన అభిమానులను జగన్‌ ఆత్మీయంగా పలకరించారు. ఇందు కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ ఓదార్పు యాత్రకు రెడీ అయ్యారు. రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల్లో ఓదార్పు పూర్తి చేసిన ఆయన ఇవాళ్టి నుంచి కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!