హైదరాబాద్‌లో బాంబు కలకలం
ఒకవైపు గణేష్ నిమజ్జనోత్సవానికి భారీగా గణపతులు తరలి వస్తున్న సమయంలో.. బాంబులాంటి వార్త.. హైదరాబాద్ మెహదీపట్నంలోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 40 దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపింది. అనుమానం వచ్చిన స్థానికులు.. విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ బృంధంతో తనిఖీలు నిర్వహించారు. అయితే చెకింగ్ చేసిన పోలీసులు.. బ్యాగ్ లో ఇసుక, టిఫిన్ తో పాటు.. పాలిథిన్ కవర్లో కాపర్ వైరు, సెల్ ఫోన్ కు సంబంధించిన పరికరాలను కనుగొన్నట్లు చెబుతున్నారు. అయితే ఇది బాంబ్ ను తయారుచేస్తూ మధ్యలోనే వదిలేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఒక డిటోనేటర్ పెడితే ఇది పూర్తి బాంబ్ గా తయారైనట్లే అని కథనాలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలానికి డీసీపీ స్టీఫెన్ రవీంద్ర కూడా వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కాగా మరికొన్ని ఛానెళ్లు.. టిఫిన్ బాక్స్ లో బాంబ్ లేదని పోలీసులు గుర్తించినట్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి.