పోస్ట్‌లు

kirankumar reddy chandrababu naidu tdp congress ys jaganmohanreddy ap political news ap political gossips raitu chaitanya yaatra. లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అవిశ్వాస తీర్మాణం కోసం టిడిపి ఆందోళ‌న‌

చిత్రం
రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ ఇచ్చిన నోటీసుపై శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రస్తావించలేదు. ఆ నోటీసు ప్రస్తావన లేకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో తెలుగుదేశం శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా వారు శనివారం స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ఆ తర్వాత పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో తమ నేత చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. స్పీకర్ తీరను ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. స్పీకర్ చర్యను అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. తమ నోటీసును స్పీకర్ ప్రస్తావించకపోవడాన్ని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తప్పు పట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందనేది తేలిపోయిందని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే ఆర్హతను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ నోటీసుపై ఏ విధంగా పోవాలనే విషయంపై మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. స్పీకర్‌పై పోరాటం చేయాలా, ప్రభుత్వంపై ఉద్యమించాలా, గవర్నర్‌పై...

అవిశ్వాసం పై చర్చ లేకుండానే అసెంబ్లీ నిరవధిక వాయిదా

చిత్రం
ముందుగా ఊహించినట్టు గానే  అవిశ్వాసం పై చర్చ జరగకుండానే అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. టీడీపీ శనివారం ఉదయం కిరణ్ సర్కార్ పై అవిశ్వాసం పెట్టేందుకు  మళ్ళీ నోటిస్ కూడా ఇచ్చింది . అయితే స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎన్నిక, అభినందనలు పూర్తీ కాగానే స్పీకర్ సభను నిరవధికం గా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పోడియం వద్దకు దూసుకెళ్ళి భైటాయించారు. అవిశ్వాస తీర్మానం పై చర్చకు అవకాశం కల్పించాలని పట్టు పట్టారు. అయితే ఇవేవి స్పీకర్ పట్టించుకోలేదు.  ఈ పరిణామం తో ఆగ్రహించిన చంద్ర బాబు ఇక గవర్నర్ దగ్గర ఈ అంశం పై తేల్చుకోవాలని నిర్ణయించారు . ఈ సాయంత్రం గవర్నర్ ని కలసేందుకు సిద్ధమౌతున్నారు. –KNM 

స్పీక‌ర్‌గా నాదెండ్ల ఎన్నిక..!

చిత్రం
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్పీక‌ర్ అభ్య‌ర్థిగా సీనియ‌ర్ నేత కె.ఇ. కృష్ణ‌మూర్తిని నియ‌మించారు. అయితే స్పీక‌ర్ పోటీలో డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్ గెలిచారు. ఇక ప్ర‌భుత్వం అవిశ్వాస తీర్మాణంపై ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది..

మరో 15మంది మారితే కిరణ్ అవుటేనా?

చిత్రం
తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టదలచిన అవిశ్వాసతీర్మానం గనుక సీరియస్‌రూపం దాల్చితే పరిణామాలెలా ఉంటాయ న్నదానిపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం 38 మంది కాంగ్రెస్ సభ్యుల కనుక.. కిరణ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే.. ప్రభుత్వం కష్టాల్లో పడుతుందన్నది ఒక అభిప్రాయం. దానికి లెక్కలిలా ఉన్నాయి, ప్రస్తుతం 293 మంది సభ్యులు సభలో ఉన్నారు. అందులో కాంగ్రెస్‌ – 155, పీఆర్పీకి – 17, ఎంఐఎంకు – 7, ఇండిపెండెంట్లు – 3 ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. కాగా తెలుగుదేశం – 89, సీపీఐ – 4, సీపీఎం, లోక్‌సత్తాకు ఒకరి చొప్పున ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అధికారికంగా ఒక్కరే సభ్యులు. కాగా కాంగ్రెస్‌కు చెంది జగన్‌కు మద్దతిస్తున్న వారు అలాగే.. పీఆర్పీ, టీడీపీల నుంచి మద్దతిస్తున్న వారి సంఖ్య 38 వరకు ఉండవచ్చని ఒక అంచనా. నిజంగానే 38 మందికనుక వ్యతిరేకంగా ఓటేస్తే.. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడుతుంది. అలాగే టీఆర్ఎస్‌కు 11 మంది బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడాలంటే.. 147 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ప్రజారాజ్యం నుంచి...

కిరణ్ కు ఎంత ధైర్యం వచ్చేసింది!

చిత్రం
అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలోనేకాదు. వచ్చే ఎన్నికలలోకూడా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని కిరణ్ చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబును చూసి జాలిపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తనను అసమర్ధుడని వ్యాఖ్యానించడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.మొత్తం మీద కిరణ్ కు గట్టి విశ్వాసం వచ్చినట్లుంది.ఇప్పట్లో తన ప్రభుత్వం పడిపోదని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, జగన్ ల మధ్య అవిశ్వాస తీర్మానం వివాదంగా మారడం ఆయన ఆనందం కలిగిస్తోంది. చంద్రబాబు స్వయంగా జగన్ ను గవర్నర్ వద్ద ఆయనను బలపరిచే ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలని కోరడం, తనవద్ద అంతమంది బలం లేదని జగన్ చెప్పడంతోకిరణ్ కు పూర్తి నమ్మకం వచ్చినట్లు అనుకోవాలి.నిజంగానే ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు సిద్దపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంటే మళ్లీ కోట్లు ఖర్చు పెట్టాలి. మూడేళ్ల పదవీకాలం వదులుకోవాలి. తిరిగి టిక్కెట్ వస్తుందో రా...

కిరణ్ కు సన్నిహితులు ఆ నలుగురేనా!

చిత్రం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోను, అదికారవర్గాలలోను ఎవరిని బాగా విశ్వాసంలోకి తీసుకుంటున్నారన్నదానిపై కాంగ్రెస్ వర్గాలలో ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితులలో కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులనే నమ్మకస్తులుగా భావిస్తున్నారని చెబుతారు. వారిలో ఒకరు పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాగా, మరొకరు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అని చెబుతున్నారు. మొదట రాజనరసింహతో అంత పెద్ద సంబంధాలు లేకపోయినా, ఆ తర్వాత కాలంలో మెరుగుపడ్డాయని, విద్యార్ధి దశనుంచి వీరిద్దరికి ఉన్న స్నేహం కూడా కొంత ఉపయోగపడిందని అంటున్నారు. మిగిలిన మంత్రులలో మరికొంతమందితో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ వీరిద్దరికి లభిస్తున్న ప్రాధాన్యత గణనీయమైనదని అంటున్నారు. కాగా అధికారులలో శ్రీధర్, (పి ఎస్ xగా పనిచేస్తున్న శ్రీధర్ కాకుండా)రావత్ అనే ఇద్దరు అదికారులకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయాలను కూడా వీరిద్దరితోనే సమావేశమై తీసుకుంటు న్నారని చెబుతున్నారు. ఒక్కోసారి ఇతరుల అప్పాయింట్ మెంట్లను క...

రైతు చైతన్య యాత్రలకు మంత్రులు డుమ్మా

చిత్రం
రైతు చైతన్య యాత్రలకు పదహారు మంది   మంత్రులు డుమ్మా కొట్టారంటే  ఈ సర్కా కి రైతు పట్ల ఎంత ప్రేమ వుందో అర్ధమైపోతుంది. చైతన్య  యాత్ర లంటే మంత్రులే భయపడిపోయే పరిస్థితి నెలకొందంటే రైతు దుస్తితి  మరెంత  ఘోరంగా వుందో ఇట్టే తెలిసిపోతుంది ధాన్యానికి గిట్టుబాటు ధర మాట అటుంచితే .. కొనే నాథుడే లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు .ఇలాంటి పరిస్తితుల్లో రైతుకి అండగా నిలవాల్సిన సర్కార్ చైతన్య యాత్రలు చేయడం కంటే కొనుగోలు యాత్రలు చేయాల్సిన అవసరం ఎంతో వుంది ఇదిలా వుంటే రైతు చైతన్య యాత్రలకు తొలి రోజే నిరసన సెగలు తగిలాయి. దీంతో యాత్రలకు   వెళ్తే రైతులు నిలదీస్తారని, వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయం తో  మంత్రులు  డుమ్మా కొట్టారు. సీఎం కిరణ్ కూడా రైతు సమస్యల పరిష్కారం పట్ల అంత సీరియస్ గా లేరు. మొత్తం సర్కారే నాన్ సీరియస్ గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. చంద్ర బాబు  సీఎం కిరణ్  ను ఒట్టి చవట, దద్దమ్మ,అసమర్ధుడు  అని రోజు తిట్టిపోస్తున్నారు. ఇక జగన్ ప్రజా సమస్యలు పట్టని ఈ సర్కార్ కూలిపోవడం ఖాయమని ...