మరో 15మంది మారితే కిరణ్ అవుటేనా?


తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టదలచిన అవిశ్వాసతీర్మానం గనుక సీరియస్‌రూపం దాల్చితే పరిణామాలెలా ఉంటాయ న్నదానిపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం 38 మంది కాంగ్రెస్ సభ్యుల కనుక.. కిరణ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే.. ప్రభుత్వం కష్టాల్లో పడుతుందన్నది ఒక అభిప్రాయం. దానికి లెక్కలిలా ఉన్నాయి, ప్రస్తుతం 293 మంది సభ్యులు సభలో ఉన్నారు. అందులో కాంగ్రెస్‌ – 155, పీఆర్పీకి – 17, ఎంఐఎంకు – 7, ఇండిపెండెంట్లు – 3 ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. కాగా తెలుగుదేశం – 89, సీపీఐ – 4, సీపీఎం, లోక్‌సత్తాకు ఒకరి చొప్పున ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అధికారికంగా ఒక్కరే సభ్యులు. కాగా కాంగ్రెస్‌కు చెంది జగన్‌కు మద్దతిస్తున్న వారు అలాగే.. పీఆర్పీ, టీడీపీల నుంచి మద్దతిస్తున్న వారి సంఖ్య 38 వరకు ఉండవచ్చని ఒక అంచనా. నిజంగానే 38 మందికనుక వ్యతిరేకంగా ఓటేస్తే.. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడుతుంది. అలాగే టీఆర్ఎస్‌కు 11 మంది బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడాలంటే.. 147 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ప్రజారాజ్యం నుంచి 17, ఎంఐఎం 7, ముగ్గరు ఇండిపెండెంట్లను కలిపితే.. 182 సభ్యులు అవ్వాలి. కానీ ఇందులోంచి 36 మంది సభ్యులు కనుక తగ్గితే.. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుంది. లేదా తెలుగుదేశంతో పాటు ఇతర పక్షాల నుంచి కొంత మందిని ఆకర్షించగలిగితే పర్వాలేదు. అలాకాకుండా విపక్షాలన్నీ ఏకమై.. జగన్‌ కనుక కాంగ్రెస్‌ నుంచి 38 మందిని ఆకర్షించగలిగితే.. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. శుక్రవారం విజయమ్మతో పాటు 25 మంది ఎమ్మెల్యేలు జగన్‌ వెంట ఉన్నట్లుగా తేలింది. ఇంకో 12 నుంచి 15 మందిని జగన్‌ కనుక ఆకర్షించి విపక్షాల ఓట్లన్ని చీలకుండా ఉంటే.. ప్రభుత్వం పడిపోవడం ప్రమాదం ఉంది. అయితే ఈ లెక్కలు అటూ ఇటూ తారుమారు అయితే.. చెప్పలేం. ఎటైనా కావొచ్చు. అదీ స్పీకర్‌ అవిశ్వాస తీర్మానానికి అనుమతిస్తే.. అసలు గేమ్‌ మొదలవుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!