ఇవి నాకు మామూలే..!
అని అంటుంది ఐశ్వర్యారాయ్.. రాంగోపాల్‌వర్మ ఆమె అందాన్ని తన ట్వీటర్‌లో తెగ పొగిడాడు.. అది తెలిసిన అభిషేక్ భచ్చన్ కూడా తన భార్య రాము చెప్పినంత అందగత్తె అన్నది నిజమే.. అని ఒప్పేసుకున్నాడు.. కానీ ఐశ్వర్యా మాత్రం సింపుల్‌గా.. వర్మ మెసేజ్ గురించి నేను స్పందించను. ఎందుకంటే… నా కెరీర్‌లో ఇలాంటివి చాలా చూశాను అంటూ రామ్ గోపాల్ వర్మను కొట్టిపారేశింది ఐశ్వర్యారకాయ్. వర్మతో సర్కార్ రాజ్ చిత్రం చేసిన ఆమె గురించి వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో…. మోనాలిసాను మించిన వెయ్యి రెట్లు అందం ఐశ్వర్యారాయ్ సొంతం అని ట్వీట్ చేసారు. ఆయన ఏ అవసరముండి ఐశ్వర్యను ఐస్ చేద్దామనుకున్నారో తెలియదు కానీ ఈ కామెంట్ కి ఐశ్వర్య భర్త అబిషేక్ మాత్రం చాలా హ్యాపీ ఫీలయ్యి వర్మకు ఫోన్ చేసి ధాంక్స్ చెప్పారుట. అయితే ఈ తతంగం ఐష్ కు అస్సలు నచ్చలేదు. విశ్వసుందరిగా నా చరిత్ర మొత్తం గతం. ఇప్పుడు నేను ఓ వ్యక్తికి భార్యను. నా అందం అందరికీ నచ్చనవసరం లేదు. నా భర్తకు నచ్చితే చాలు. ఆయన ఎలా ఉన్నా నాకు నచ్చుతారు. నేను ఎలా ఉన్నా ఆయనకు నచ్చుతాను. ఇక వర్మ కామెంట్ గురించి అంటారా దాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే నా కెరీర్ మొత్తంలో ఇలాంటివి చాలా చూసాను అని ఆమె అంది. అసలే వర్మ తన భర్తను డిపార్టమెంట్ సినిమా లో నుంచి తీసేసి అవమాని్ంచాడని కుతకుతలాడుతున్న ఆమె ఈ కామెంట్ తో ఇంకా ఫైర్ అయిపోయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి