చిరంజీవికి దాసరితో చెక్ పెట్టడానికేనా..?
రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలవడం కాంగ్రెస్ వర్గాలలు ఆసక్తిని రేకెత్తించింది.కాంగ్రెస్ లో వర్గ విబేధాలు లేకుండా చూసుకోవడానికా, లేక కిరణ్ తన సొంత వర్గాన్ని పెంచుకోవడానికా అన్న చర్చ జరుగుతోంది. విశేషమే మిటంటే ఆయా పత్రికలు వీటిపై ప్రత్యేక కధనాలు ఇచ్చాయి. కిరణ్, దాసరిల కలయికపై సాక్షి,ఈనాడు ఒకే తరహాలో కధనాలు ఇవ్వడం విశేషం.ఈ రెండు పత్రిలలోకూడా మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలోముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్ధి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసినందుకే దానికి ప్రతిగా కిరణ్ కుమార్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి సరిపడని దాసరి నారాయణరావుతో బేటి అయి తన సమాధానం చెప్పారని కధనాలు ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ నేతలు కొందరు మాత్రం కాంగ్రెస్ లో ఐక్యత అవసరమని, కిరణ్ తో పడని వారిని కలపుకుని వెళ్లడానికి బొత్స, చిరంజీవి వంటివారు. అలాగే బొత్స, చిరంజీవి లకు పడని నేతలను కిరణ్ కలిసి ఏకతా రాగం వినిపించడానికే ఈ యత్నం అని చెబుతున్నారు. కాని దానికన్నా పోటాపోటీ రాజకీయాలలో ఎవరికి తమదే పైచేయి అనిపించుకోవడానికే ఈ బేటీలు జరిగాయని ఎక్కువమంది నమ్ముతున్నారు.దాసరి నారాయణరావుకు, చిరంజీవి సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు విబేధాలు ఉన్నమాట వాస్తవం. అలాగే కిరణ్ కు ,పెద్దిరెడ్డిల మధ్య ఉప్పు,నిప్పు అన్న సంగతి రహస్యం కాదు.బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడైనప్పటినుంచి దూకుడుగా వ్యవహరిస్తూ , చిరంజీవిని కూడా ప్రయోగిస్తున్నారని,తద్వారా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని కిరణ్ శిబిరం అనుమానంగా ఉంది.దానిని కౌంటర్ చేయడానికి కిరణ్ కూడా ఏదో ఒక వ్యూహం అనుసరించకతప్పదు. అందులో భాగంగానే దాసరిని కిరణ్ కలిశారని చెబుతున్నారు. దాసరి నారాయణరావు ఇటీవలకాలంలో కాంగ్రెస్ కు అంటీఅంటనట్లు ఉంటున్నారు. ఆయన అలిగారని కూడా ప్రచారం జరిగింది.ఈ నేపధ్యంలో రెండు పనులు కలిసి వస్తాయని కూడా కిరణ్ స్వయంగా దాసరి ఇంటికి వెళ్లారని అనుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే బొత్స సత్యనారాయణ ఒకటికి రెండుసార్లు చిరంజీవి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపితే కిరణ్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ ఆలోచన చేయలేదు. కాని దాసరి ఇంటికి మాత్రం స్వయంగా వెళ్లడం ఏదో సందేశం, లేదా సంకేతం ఇవ్వడానికే కావచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి