ఈ చంద్రగ్రహణానికి ఎందుకంత ప్రత్యేకత..?
బుధవారం అర్ధరాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 11.53 నిముషాల నుంచి గ్రహణం ప్రారంభమవ్వనుంది. గురువారం తెల్లవారుజామున 3.32 నిముషాలకు గ్రహనం ముగుస్తుంది. దాదాపు రెండున్నర గంటలకు పైగా.. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు గ్రహణం సమయంలో చీకట్లు కమ్ముకుంటాయని చెబుతున్నారు, 40 ఏళ్ల తర్వాత ఇలాంటి గ్రహణం ఏర్పడటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. కామన్‌గా చంద్రగ్రహణం ఉన్నప్పుడు.. చంద్రునిపై భూమి సాధరణ నీడ పడుతుంది. కానీ ఈ సారి చంద్రుడు పూర్తిగా భూమి వెనక్కి వెళతాడని.. భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉంటారని.. అందుకే కటిక చీకట్లు కమ్ముకుంటాయని చెబుతున్నారు. ఆసమయంలో చంద్రుడు ఎర్రబడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. గ్రహణం విడిచే సమయంలో ఎర్రబడ్డ చంద్రుడే కనబడుతాడని సైంటిస్టులు చెబుతున్నారు. ఇలా చంద్రుడు ఎర్రబడటం చాలా అరుదు అని వారు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రత్యేక గ్రహణం మన దేశంతోపాటు.. తూర్పు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో చూడొచ్చని బిర్లాప్లానిటోరియం డైరెక్టర్ డీపీ దొరై తెలిపారు. ఇక గ్రహణం సమయంలో ఆలయాలను మూసేయడం పరిపాటి. బుధవారం సాయంత్రం నుంచి దాదాపు రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం కూడా బుధవారం సాయంత్రం మూసేసి.. గురువారం తెల్లవారు జామున మళ్లీ దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అయితే గ్రహణం తర్వాత అన్ని ఆలయాల్లో మహా సంప్రోక్షణ జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాతే దైవ దర్శనాలు చేసుకోవచ్చు. అలాగే గ్రహణం విడిచాక భక్తులు పుణ్యనదుల్లో స్నానమాచరిస్తారు. ఇక ప్రతీ గ్రహణం సమయంలో శ్రీకాళహాస్తి దేవాలయం ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఏ గ్రహణం వచ్చినా.. ఎప్పుడు వచ్చినా ఈ ఆలయాన్ని తెరచే ఉంచుతారు. గ్రహణం సమయంలో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవదేవుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. దాదాపు 3 వేల ఏళ్ల నుంచి గ్రహణ సమయాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని ఆలయాధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది సంపూర్ణ చంద్రగ్రహణాల్లో ఇదే మొదటిదని.. తర్వాత రెండోది డిసెంబర్ 10 న ఏర్పడనుందని నిపుణులు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి