టివీ రేటింగ్స్ పెంచుతున్న `గర్భాలు’
హిందీ టివీ సీరియల్స్ టిఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం తెగ తాపత్రయపడిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు పెళ్ళితంతు, ఆచారవ్యవహారాలపై సుదీర్ఘ సీరియల్స్ తీసేసిన హిందీ ఛానెళ్లు ఇప్పుడు గర్భవతుల చుట్టూ కధలు అల్లుతున్నాయి. `మే మా బనేవాలీహూన్’ అన్న డైలాగ్ ఇప్పుడు హిందీ సీరియల్స్ లో మోతపుట్టిస్తోంది. ప్రెగెన్సీ చుట్టూ అల్లే కథలు మహిళా ఆధరణకు నోచుకుంటున్నాయనీ, దీంతో టివీ ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్ బాగా పెరుగుతున్నాయని యాజమాన్యాలు గుర్తించాయి. దీంతో ప్రెగెన్సీ చుట్టూ డ్రామాలు అల్లుకుపోతున్నాయి. ఒక ఇంట్లో కోడలు గర్భవతి అయిందని తెలియగానే ఆ ఇంట్లో సభ్యుల ఆనందాలు, ప్రేమానురాగాల చుట్టూ కథలు అల్లుకుపోతున్నాయి. ఉత్తరాన్ లో తమస్య గర్భం…ప్రతిగ్యలో కేసార్ ప్రెగెన్సీ…పవిత్ర రిష్టలో అర్చన…ఇలా ఏదో ఒక సీరియల్ లో గర్భం ఓ హాట్ టాపిక్ అయిపోయింది. యే రిస్టా క్యా కెహల్తాహై సీరియల్ లో అక్షర గర్భవతి అయిందా లేదా అన్నది స్టోరీలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. అలాగే, బాబా అయిసో వార్ దూండో సీరియల్ లో భారతి త్వరలో గర్భవతి కాబోతున్నది. అసలు గర్భవతిలు అవుతారో…అంతలో గర్భం ఏమీ లేదని తేలుస్తారన్నది స్...